విజయనగరం

డీలర్ పోస్టులను భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 12: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డిపో డీలర్ల పోస్టులను భర్తీ చేయాలని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు ఆదేశించారు. గురువారం ఆయన వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు రేషన్ సరకుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొందరు వృద్ధుల వేలిముద్రలు గుర్తించడంలో సమస్యల కారణంగా కొన్ని చోట్ల రేషన్ సరకులు అందజేయడంలో సమస్యలు వచ్చాయని, గ్రామాల్లో కార్డుదారులను గుర్తించడంలో ఏదేని సమస్యలు ఉంటే విఆర్వోలు వాటిని ధ్రువీకరించాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఐదు కిలోల బరువు గల గ్యాస్ సిలిండర్ల సరఫరాను వేగవంతం చేయాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పౌరసరఫరాలకు సంబంధించిన వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా వినతులను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జెసి లఠ్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జె.శాంతికుమారి, ఎఎస్‌ఒలు సత్యనారాయణరాజు, ఆర్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మండల స్థాయి ప్రణాళికలతో ముందుకెళ్లాలి
* ప్రతి వారం 350 మరుగుదొడ్లు నిర్మించాలి * జెసి నాగేశ్వరరావు

విజయనగరం, అక్టోబర్ 12: స్వచ్ఛ విజయనగరంలో భాగంగా ఆరుబయట మలవిసర్జన లేని జిల్లాగా (ఒడిఎఫ్)గా రూపొందించేందుకు మండల స్థాయి అధికారులు ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని జెసి కె.నాగేశ్వరరావు మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మండల స్థాయి అధికారులతో ఐఎస్‌ఎల్ నిర్మాణాలు, ఇ-ఆఫీసు, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అంతకు ముందరే లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి మండలంలో వారానికి 350 మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. డెంకాడ, చీపురుపల్లి గ్రామాలు ఒడిఎఫ్‌లో ముందంజలో ఉన్నాయన్నారు. ఐఎస్‌ఎల్ లేని వారికి మంజూరు పత్రాలను అందజేసి వెంటనే నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలన్నారు.
ఇదిలా ఉండగా జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని డిఆర్వో రాజ్‌కుమార్ ఆదేశించారు. మండల స్థాయి నుంచి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్‌కు పంపించే అన్ని ఫైళ్లను ఇకపై ఇ-ఆఫీసు ద్వారా పంపించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే విజయనగరంలో ప్రారంభించామని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాల్టీల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రధానాధికారితో శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు సమావేశం ఉందన్నారు. అన్ని మున్సిపాల్టీల ఇఆర్‌ఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల డిటిలు హాజరు కావాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను నిర్ధేశించిన కాలంలో వాటిని పరిష్కరించాలన్నారు. ఒకవేళ నిర్ణీత వ్యవధిలో పరిష్కరించని అధికారులపై పెనాల్టీ విధించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. జిల్లాలోని విఆర్వోలు, విఆర్‌ఎలు తప్పనిసరిగా తమ వ్యక్తిగత మరుగుదొడ్లను కలిగి ఉండాలని, లేని వారు వెంటనే వాటిని నిర్మించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి సునీల్‌రాజ్‌కుమార్, ఎస్‌డిసి శ్రీలత, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి, హౌసింగ్ పిడి రమణమూర్తి, డ్వామా పిడి రామచంద్రరావు పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరమయ్యేవరకూ పోరాటం
* సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 12: వంశదార నిర్వాసితుల సమస్య పరిష్కరమయ్యేవరకూ పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుఅన్నారు. వంశదార నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వారి అక్రమకేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గురువారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావుమాట్లాడుతూ ముఖ్యంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న నాయకులకు అక్రమకేసులు బనాయిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న వామపక్ష నాయకులపై నిరంకుశంగా అవలంభించడం తగదని అన్నారు. రాష్ట్రంలో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాజధాని నిర్మాణమే ధ్యేయంగా నిర్వాసితుల సమస్యల గురించి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయేరోజులు అతిసమీపంలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సిపిఐ నాయకులు బాయి రమణమ్మ, తుమ్మి అప్పలరాజుదొర, పొందూరు అప్పలరాజు, సిపిఎం నాయకులు రెడ్డి శంకరరావు, రాకోటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

పార్శిల్, సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి
* డిప్యూటీ సిటిఎం అప్పలనాయుడు
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 12: పార్శిల్, సరుకు రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆర్టీసీ విజయనగరం జోనల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ (ఎం అండ్ సి) అప్పలనాయుడు కోరారు. స్ధానిక జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ కళాశాలలో గురువారం సిస్టం సూపర్‌వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పార్శిల్, సరుకు రవాణాలో ఆర్టీసీ విశేషమైన సేవలు అందిస్తుందని తెలిపారు. మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బస్టాండులలోను పార్శిల్, సరుకు రవాణా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందువల్ల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునేవిధంగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. విజయనగరం రీజియన్ అసిస్టెంట్ ట్రాఫిక్‌మేనేజర్ ఎం.సన్యాసిరావుమాట్లాడుతూ విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లతోపాటు ముఖ్యమైన ప్రాంతాలలో పార్శిల్, సరుకు రవాణా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పార్శిల్, సరుకు రవాణా ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

‘వరిపంటలో తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలి’
దత్తిరాజేరు, అక్టోబర్ 12:వరిపంటలో తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారి కె.గోవిందమ్మ రైతులకు సూచించారు. కోమటిపల్లి, ఇంగిలాపల్లి గ్రామాలలో వరిచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొట్టదశలో తెగుళ్ల నివారణకు వర్మీకంపోస్టు లేదా వేపపిండితో తయారుచేసిన ఎరువులను వినియోగించాలన్నారు. రైతులు రసాయనిక ఎరువుల స్థానే సేంద్రియ ఎరువులను వాడాలని కోరారు. వరిపంటలో తెగుళ్లు సోకినవెంటనే తమకు సమాచారం అందిస్తే వరిచేలను పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎఇఒ లీలాకృష్ణ, ఎంపిఇఒ సాయి, రైతులు పాల్గొన్నారు.