విజయనగరం

పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరంపూల్‌బాగ్), అక్టోబర్ 17: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి మంగళవారం విశేష పూజలు జరిపారు. సిరిమానోత్సవం అనంతరం 15రోజులు తరువాత ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చదురుగుడి ప్రాంగణంలో ఉయ్యాలను ఏర్పాటుచేసి పలు రకాల పుష్పాలతో ఉయ్యాలను అలంకరించి అందులో ఘటాలను నిలిపారు. పలువురు మహిళలు ఘటాలకు పసుపు-కుంకుమలతో పూజలు జరిపి నూతన వస్త్రాలను చూపి మొక్కులను చెల్లించుకున్నారు. ఉయ్యాల-కంబాల పురస్కరించుకుని వేకువజామున అమ్మవారికి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రత్యేక కుంకుమపూజలు, శ్రీచక్ర పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం వేకువజాము నుండి క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో నిల్చొన్న భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా పర్యవేక్షణ జరిపారు. రాత్రి 11 గంటలకు ఉయ్యాల-కంబాల ఉత్సవాన్ని నిర్వహించారు.