విజయనగరం

డివిజన్ల స్థాయిలో మెగారక్తదాన శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం డివిజన్ స్థాయిల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ డిజిపి ఆదేశాల మేరకు ఒకే రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 18న ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించనున్నామన్నారు. పోలీసు శాఖ దత్తత తీసుకున్న 10 ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. సమాజానికి పోలీసులు చేస్తున్న సేవలను ప్రజలకు వివరిస్తామన్నారు. 18న పరుగుపందెం పోటీలు, వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఎఎస్పీ ఎవి రమణ, డిఎస్పీలు రాజేశ్వరరావు, త్రినాథ్, గురుమూర్తి, ఎఎస్ చక్రవర్తి, ఎ హనుమంతు, సిఐ బి.చంద్రశేఖర్, సిఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.

బిసిల సమస్యల పరిష్కరించకపోతే ఆందోళన
* బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధు
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 17: బిసిల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు అన్నారు. పట్టణంలో యూత్‌హస్టల్‌లో మంగళవారం బిసి సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బిసిల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. ఈనెల 22వతేదీన రాజమండ్రిలో జరిగే బిసిగర్జనకు జిల్లా నుంచి పెద్దఎత్తున బిసిలు తరలిరావాలని కోరారు. జిల్లా బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బివికె ప్రసాద్ మాట్లాడుతూ బిసి ఉద్యోగుల రిజర్వేషన్, క్రిమిలేయర్, ప్రమోషన్లపై గర్జనలో చర్చిస్తామన్నారు. బిసి ఉపాధ్యాయుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పోట్నూరు భాస్కరరావుమాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్‌ను ఏర్పాటుచేసి ఎంతో మేలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి మొదిలి నాగభూషణరావు, ఆర్టీసీ కార్మిక నాయకుడు సత్యనారాయణ, నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జి జానా ప్రసాద్ పాల్గొన్నారు.