విజయనగరం

మన్యంలో మళ్లీ జ్వరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), అక్టోబర్ 17: పార్వతీపురం మన్యచి ప్రాంతంలో జ్వరాలు మళ్లీ ప్రబలుతున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నాఠు. గత మే నెల మొదలుకొని ఇప్పటి వరకు రెండు, మూడు సార్లు జ్వరాలు ప్రబలి ప్రజలను వేధిస్తున్నాయని అంటున్నారు. మే నెల నుండే పార్వతీపురం ఐటిడిఏ సబ్-ప్లాన్‌లో మలేరియా జ్వరాలు ప్రారంభం అయ్యాయని అంటున్నారు. అప్పటి నుండి వైరల్, మలేరియా జ్వరాలు బాధిస్తున్నాయని చెబుతున్నారు. మలేరియా, వైరల్ జ్వరాలకు గతంలో పూర్తిగా మందులు, ఇంజక్షన్లు కోర్సు వాడినప్పటికీ మళ్లీ ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయని వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఆ వెంటనే వేడెక్కుతున్న వాతావరణం వాటి వలన ప్రజలు గత వారం రోజులుగా జ్వరాల బారిన పడుతున్నారు. అక్టోబర్ నెల మొదలుకొని జూన్ నెలకు మల్లే జ్వరాలు విజృంభిస్తున్నాయని వాపోతున్నారు. దీంతో జ్వర పీడితులు ఆర్‌ఎంపి, పిఎంపి, సంచి వైద్యులతోపాటు సమీపంలోని పిహెచ్‌సిలకు, ప్రైవేటు, ఏరియా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి 100 పడకలు కలిగిన ఏరియా ఆసుపత్రిలో 242 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సీజన్‌లో అత్యధికంగా రోగులు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పడకలు చాలకపోవడంతో ఒక బెడ్‌కు ఇద్దరు, ముగ్గురు రోగులను సర్దుబాటు చేస్తున్నారు. రోగుల తాకిడి అధికంగా ఉండడంతో ఉన్న వైద్యాధికారులు, సిబ్బంది తలకు మించిన పనిభారంతో నానా అవస్థలు పడుతున్నారు. జ్వరాలకు ప్రధానంగా ఆయా ప్రాంతాలలో అపారిశుద్ధ్యంతోపాటు వాతావరణంలో నెలకొన్న మార్పులు కారణమని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల డెంగ్యూ జ్వరంతో కొమరాడకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, మలేరియా జ్వరంతో పూసనందికి చెందిన చెల్లయ్య అనే విద్యార్థి, పచ్చకామెర్లు, జ్వరంతో రాయగడ జమ్ముకు చెందిన కిల్లక తిరుపతి తదితరులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. జ్వరాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం లేదని ప్రజలు వాపోతున్నారు.

బాడంగి విమానాశ్రయానికి మహర్దశ?
బాడంగి, అక్టోబర్ 17: ఏడు దశాబ్ధాల క్రితం నిర్మించిన బాడంగి విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు భోగాపురం విమానాశ్రయం డెవలప్‌మెంట్ అధికారులు మంగళవారం పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుబంధంగా బాడంగిలో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా భోగాపురం విమానాశ్రయం డెవలప్‌మెంట్ సిఇఓ వీరేంద్రసింగ్, ఓఎస్‌డి అనంత్, భోగాపురం విమానాశ్రయం ఎస్‌ఇ రవికుమార్, పార్వతీపురం ఆర్డీవో సుదర్శనదొర, భోగాపురం విమానాశ్రయం జనరల్ మేనేజర్ వంశీమూర్తి సంయుక్తంగా వచ్చి బాడంగి విమానాశ్రయం మ్యాప్‌ను, పూర్వ స్థలాలను పరిశీలించారు. గతంలో ఈ విమానాశ్రయానికి సుమారు 150 ఎకరాల స్థలంలో నాలుగు రన్‌వేలు నిర్మించారు. వీటిని వారు పరిశీలించారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఎంతవరకు అనుకూలంగా ఉందో అన్న విషయాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు వచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయం భూమి కాకుండా మరో 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించేందుకు వారు ఆలోచనలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్డీవో సుదర్శన దొరను ప్రశ్నించగా భోగాపురం విమానాశ్రయానికి అనుబంధంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు స్థలాన్ని ప్రాథమికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం తమను పంపించిందని తెలిపారు.

వైకాపాలో 50 వేల కుటుంబాలను చేర్చడమే లక్ష్యం
* మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య
గజపతినగరం, అక్టోబర్ 17: గజపతినగరం నియోజకవర్గంలో 50వేల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడమే తమ లక్ష్యమని, ఇంతవరకు 25వేల కుటుంబాలు చేర్పించామని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలాఖరునాటికి తమ లక్ష్యం నెరవేరుస్తామని తెలిపారు. గ్రామాలలో తమ పార్టీ ప్రకటించిన నవరత్నాల ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. బిసిల అభివృద్ధి కోసం వైకాపా అధినేత జగన్ మంచి కార్యాచరణ రూపొందించారన్నారు. నియోజకవర్గాల వారీగా తాము గ్రామాలలో తిరిగి కుల సంఘాలు, కులవృత్తుల వారితో చర్చించి అభ్యున్నతి కోసం మంచి పాలసీని తీసుకువస్తామన్నారు. బిసిల పరిస్థితి ఈ ప్రభుత్వంలో దయనీయంగా మారిందని, వారంతా రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ వలె బిసిలకు వలలు, ఇస్ర్తిపెట్టెలు పంపిణీ చేసి చేతులు దులుపుకొనేది లేదని, వారికోసం మంచి మ్యాన్‌ఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. కొన్ని బిసి కులాలు బిసి-ఎలో చేర్చాలని, మరికొన్ని కులాలు ఎస్సీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని, వాటన్నింటిపై అధ్యయనం చేసి జగన్ ప్రకటన చేస్తారని, వ్యక్తిగత పింఛన్లు నెలవారీ పెంచే యోచనలో ఉన్నారన్నారు. సమావేశంలో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, కడుబండి రమేష్‌నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లి సంజీవరావు పాల్గొన్నారు.