విజయనగరం

నేడు భీమసింగి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, అక్టోబర్ 20: భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘంకోసం కార్మిక సంఘాల ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ ఎన్నికలలో సిఐటియు, ఎఐటియుసిల మధ్య హోరాహోరీ పోటీ జరగనున్నది. ఈ ఎన్నికలలో 279 కార్మికులు పాల్గొననున్నారు. ఇప్పటికే కర్మాగారంలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఎఐటియుసి, సిఐటియు సంఘాల నాయకులు ఆధ్వర్యంలో కార్మికులతో కలసి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎఐటియుసి సంఘానికి సంబంధించి జిల్లా నాయకుడు వి.కృష్ణంరాజు మాట్లాడుతూ సుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే నాలుగుకోట్ల రూపాయల అప్పులో ఉందని, ఈ అప్పును ప్రభుత్వమే తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా రైతులకు, కార్మికులకు న్యాయం చేకూరుతుందని చెప్పారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కార్మికుల శ్రేయస్సే థ్యేయంగా పనిచేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. తమ గుర్తు ‘నక్షిత్ర’పై ఓటు వేయాలని కోరారు. గత ఎన్నికలలో ఒటమిపాలైన కారణాలను సవరించుకుని సరైన పద్దతులను అవలంభిస్తామని కార్మికులు తెలుపుతున్నారు. అదే విధంగా సి ఐటియు నాయకులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ భీమసింగి పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఉన్నామని, కార్మికుల ప్రతి సమస్యను కూలకుషంగా పరిశీలించే దిశగా పయనిస్తున్నామని అన్నారు. నేడు జరగబోయే ఎన్నికలలో తమ సంఘం గంట గుర్తుపై ఓటువేసి తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నిర్వహించబోయే ఎన్నికలు 9గంటలకు ప్రారంభమై 2గంటలతో ముగియనున్నాయి. వెనువెంటనే ఓట్లు లెక్కింపుప్రారంభమై గెలుపొందిన గుర్తింపు సంఘాన్ని ప్రకటించనున్నారు.