విజయనగరం

పోరాటాల పార్టీ సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 26: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఇక్కడ అమర్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గసభ్యుడు జల్లి విల్సన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో విల్సన్ మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26న దేశ స్వాతంత్య్రానికి ముందుగానే ఆవిర్భవించిందని అన్నారు. దునే్నవాడికే భూమి అనే నినాదంతో పీడిత ప్రజల ఆశాజ్యోతిగా దేశంలో జరుగుతున్న అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ కార్మిక, కర్షకులకు కనీస వేతనాలు అమలుకు, పనిభద్రత కోసం అనే క సంక్షేమ చట్టాల కోసం అలుపెరగని పోరాటాలు చేసిందని అన్నారు. అదేవిధంగా భూ సంస్కరణల అమలు కోసం సమరశీల ఉద్యమాలు నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు దక్కేటట్లు చేసిందని తెలిపారు. బ్యాంకుల జాతీయకవరణ, రాజభరణాల రద్దు, ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపన, కార్మిక, కర్షకుల హక్కుల పరిరక్షణకు ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు చేసి విజయాలు సాధించిందని చెప్పా రు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో ఉద్యమాలు చేసేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఒకవైపు కార్మిక చట్టాలకు సవరణలు చేస్తూ, మరోవైపు చిల్లర వ్యాపారుల ఉపాధికి దెబ్బతిసే విధానాలకు పాల్పడుతున్న మోదీ పాలనపై అలుపెరగని పోరాటాలు చేయాలని తెలిపారు. 2015 భూ ఆర్డినెన్స్ రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆల్తి అప్పలనాయుడు, వి.కృష్ణంరాజు, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి, బిటి నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాణ్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్ల కృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.