విజయనగరం

తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, నవంబర్ 14: మండలంలోని కిల్తంపాలెం నవోదయ విద్యాలయం సమీపంలో తాటిపూడి-విజయనగరం రోడ్డుపై మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు బస్సు దగ్దమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పాపులర్ షూమార్టు హోల్‌సేల్ షాపులో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలతో కలసి 27 మంది ప్రైవేటు మినీ ఎసి బస్సులో విశాఖ జిల్లా బొర్రా గృహలు విహారయాత్రకు బయలుదేరారు. ఉదయం 8గంట సమయంలో తాటిపూడి జలాశయం వద్ద బస్సు ఆపి టిఫిన్లు చేసి తిరిగి బొర్రా బయలుదేరారు. కిల్తంపాలెం నవోదయ స్కూల్ వద్దకు రాగానే బస్సు షార్టుసర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి
ప్రయాణీకులను సురక్షితంగా దింపివేశాడు. ప్రయాణీకులంతా చూస్తుండగా కొద్ది నిమిషాలకే బస్సు అంతా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్దమైంది. బస్సు డ్రైవర్ మంటలను ముందుగా గమనించడంతో పెనుముప్పు తప్పింది.

గ్రంథాలయా ఉద్యమానికి ఆంధ్రులే అంకురార్పరణ

శృంగవరపుకోట, నవంబర్ 14: గ్రంథాలయ ఉద్యమానికి ఆంధ్రులే అంకురార్పణ అని బాపూజీ యువజన సంఘం వ్యవస్థాపకులు మోపాడ మరియాదాస్ అన్నారు. మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో 50వ గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి గ్రంథాలయాలను సక్రమంగా వినియోగించుకుని లబ్ది పొందాలని అన్నారు. గ్రంథాలయాలలో ఎంతో విలువైన పుస్తకాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వీటిని సక్రమంగా విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. గ్రంథాలయ అధికారిణి లక్ష్మి మాట్లాడుతూ 14నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు సందర్భంగా పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థిని, విద్యార్థులు వీటిలో పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి నాగమోహిని, ఎంపిటిసి ఆర్.లక్ష్మి, డాక్టర్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.