విజయనగరం

వాతావరణ మార్పులతో రైతుల వెన్నులో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, నవంబర్ 14: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకోవడంతో రైతుల వెన్నులో వణుకు మొదలైంది. వరిపంట కోతలు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో తుఫాన్ హెచ్చరికలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పండినా ధాన్యం రాసులు తమ ఇంటికి చేరుతాయోలేదో అన్న భయం రైతులను ఆవహించింది. మండలంలో వరిసాగు విస్తీర్ణంలో తాటిపూడి జలాశయం నీటి ఆధారంగా సగం, వర్షాధారంగా మిగిలిన సగభాగం పండిస్తున్నారు. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా రైతులు వరిపంట వేశారు. ఆయకట్టుగ్రామాలలో వరిపంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షాధార గ్రామాలలో ఆఖరి దశలో నీటి తడిలేక పంటదిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు బెంగతో ఉన్నారు. నేడోరేపో వరి పంట కోతలు ప్రారంభించడానికి ఆయకట్టు రైతులు సిద్ధపడుతున్న తరుణంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాధార పంట రైతులు విషయానికి వస్తే ఆఖరిదశలో నీటితడిలేనందున కొద్దిపాటి వర్షం కురిసినా పంట దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే వర్షంతోపాటు పెనుగాలులు వీస్తే మొదటికే పంట నష్టపోతామన్న భయం అటు ఆయకట్టు రైతులలోను, ఇటు వర్షాధార ప్రాంత రైతులలోను భయం ఆవహించింది.

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

లక్కవరపుకోట, నవంబర్ 14: మండలంలో చందులూరు శివారు రొంగలివానిపాలెం గ్రామానికి చెందిన గోగాడ అమ్మతల్లినాయుడు(32) తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడి మంగళవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అవివాహితుడైన అమ్మతల్లినాయుడు తన స్నేహితుడు దేవుడునాయుడుతో కలసి లచ్చంచెరువు గట్టుమీదుగా నడుచుకుని చందులూరు వస్తుండగా ఆకస్మికంగా తేనెటీగల గుంపు దాడిచేసింది. ఈ సంఘటనతో భయబ్రాంతులై స్నేహితులు ఇద్దరు చెరొక దారిలో పరుగుతీశారు. అయితే అమ్మతల్లి నాయుడు చెరువులో దిగి తేనెటీగల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో చెరువు ఊబిలో కూరుకుపోయి మృతిచెందాడు. ఈ విషయాన్ని తీవ్రంగా గాయపడిన దేవుడునాయుడు విలేఖరులకు తెలిపాడు. ఇదే సంఘటనలో తమపై కూడా తేనెటీగలు తమపై దాడిచేసి గాయపరిచాయని నాతవరపురాములమ్మ, రావాడ దేవుళ్లు తెలిపారు. అంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి మృతదేహాన్ని ఎస్.కోట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.