విజయనగరం

రైతుక్షేత్ర దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, నవంబర్ 14: జాతీయ ఆహారభద్రత మిషన్‌లో భాగంగా మండలంలోని అప్పలన్నపాలెం గ్రామంలో మంగళవారం రైతు క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆశాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు మెరుగైన పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, సూచనలు, సలహాలు పాటించి మెరుగైన వ్యవసాయాన్ని చేసుకోవాలని అన్నారు. వరిపంటకు పూర్వపద్థతులను విడనాడి నూతనంగా అవలంభించాల్సిన పద్ధతులను అనుసరించాలని చెప్పారు. డ్రమ్‌సీడ్, మిషన్ ప్లాంటేషన్ పద్ధతుల కంటే సీడ్‌డ్రిల్ పద్దతిలోనే అధిక దిగుబడులు సాధించగలమని తెలపడం చాలా అభినందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా కొత్తవలస వ్యవసాయ ఎడి ఎ మహరాజన్ మాట్లాడుతూ మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులకు అందుబాటులో ఉంటున్నారని, ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో రైతులను కలసి నూతన పద్దతుల ద్వారా వ్యవసాయంచేసేలా పలు రకాల పంటలపై అవగాహన కల్పించడమేకాకుండా పచ్చిరొట్ట ఎరువులు తయారీ, వర్మీకంపోస్టు ఎరువులు తయారీ చేసుకుని నేలను సారవంతంగా ఉండేలా కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన పలువురు వ్యవసాయ శాస్తవ్రేత్తలు డాక్టర్ సంజయ్‌రాణి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ విశాలాక్షిలు మాట్లాడుతూ వరిపంట తెగుళ్ళు నివారణ ఉపయోగించే మందుల గురించి కొత్తరకం విత్తనాల వినియోగం, వాటి నుంచి సాధించే దిగుబడుల గురించి నేలను సారవంతంగా తయారుచేసుకునే పద్దతుల గురించి వివరించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు పండించిన వరి పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు, మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఎఇఒలు సిబ్బంది ఉన్నారు.

గిరిజనులకు వెంటనే పట్టాలు అందజేస్తాం

కొత్తవలస, నవంబర్ 14: మండలంలో గిరిజన యూనివర్సిటీకి భూములు ఇచ్చిన గిరిజనులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తామని ఆర్డీ ఒ కె.వెంకట మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలసి గిరిజన యూనివర్సిటీ భూములను పరిశీలించారు. గిరిజనులకు ఇస్తామన్న ఇండ్ల స్థలాలకు సంబంధించిన భూములను గిరిజన నాయకులతో కలసి సందర్శించారు. 147మందికి ఇళ్లస్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చేందుకు అన్ని ప్రతిపాదనలు సిద్దం చేశామని రెవెన్యూ సిబ్బంది ఆర్డీఒకు తెలిపారు. భూమికి భూమి ఇచ్చే స్థలాలను సాధ్యమైనంత త్వరలోనే చదును చేసి అప్పజెప్పుతామని ఆర్డీఒకు తెలిపారు. అదే విధంగా కాటకపల్లి రెవెన్యూలో పతంజలి సంస్థకు కేటాయించిన భూములను ఆర్డీఒ సందర్శించారు. ఈ మధ్యకాలంలో ఆయా భూములకు సంబంధించిన రైతులు హైకోర్టుకు వెళ్లడంతో దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కోర్టు రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో ఆర్డీ ఒ ఈ భూములను పలుమార్లుపరిశీలిస్తున్నారు. కొంతమంది రైతులకు నష్టపరిహారం అందజేయడంలో ఏర్పడిన వివాదం కోర్టు వరకు వెళ్లడంతో పతంజలి సంస్థ నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకడుగు వేస్తున్నదని స్థానికులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే రైతులకు పరిహారం అందజేసి పతంజలి సంస్థ నిర్మాణానికి సహకరిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల తహశీల్దార్ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఐ తిరుపతి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.