విజయనగరం

ఉల్లాసంగా క్రీడా పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 14: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళా సమతా సొసైటీ గజపతినగరం క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన క్రీడా పోటీలు ఉల్లాసంగా సాగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలకు సంబంధించి చేపట్టిన ఈ పోటీలలో ఒక్కొక్క ఆటకు ఐదు జట్లు చొప్పున పాల్గొన్నాయి. పిడి చింత సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. చివరిగా ఖోఖో పోటీలలో బాలుర విభాగం, బాలికల విభాలలోను మరుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విజేతలుగా నిలిచారు. అలాగే కబడ్డీకి సంబంధించి మరుపల్లి ఆదర్శ పాఠశాల విజేత జట్టుగా నిలవగా వాలీబాల్‌ను గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు దక్కించుకుంది. అలాగే వ్యాసరచన, వకృత్వ పోటీలలో కూడా మరుపల్లి హైస్కూల్ విద్యార్థులే ప్రథమ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయులు కె.బి. ఆర్. ఆచార్యులు మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళ సమతా సొసైటీ సిఆర్‌పి సత్యవాణి, పిఇటిలు పాల్గొన్నారు.
మరుగుదొడ్లు నిర్మించకపోతే
నిధులు వెనక్కి వెళ్లిపోతాయి
* డిఆర్‌డిఎ పిడి సుబ్బారావు

గజపతినగరం, నవంబర్ 14: వచ్చేనెల 11వ తేదీలోగా లబ్దిదారులు మరుగుదొడ్లు నిర్మాణాలు ప్రారంభించి మొదటి చెల్లింపులు అందుకోవాలని అలా కానిపక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోతాయని డి ఆర్ డి ఎ పిడి కె.సుబ్బారావు అన్నారు. మంగళవారం మండలంలోని లోగిశ గ్రామంలో చేపడుతున్న ఐహెచ్ హెచ్ ఎల్ సర్వేను పిడి ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే చేపడుతున్న బృందాలతో మాట్లాడారు. కొన్ని నిర్మాణాలను కూడా పరిశీలించారు. తొలి చెల్లింపులు డిసెంబర్ 15లోగా అందుకోని లబ్దిదారులకు ప్రోత్సాహకాలు నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు. మార్చి నెలాఖరులోగా అన్ని గ్రామాలను ఓడి ఎఫ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి అన్నారు. బహిరంగ మలవిసర్జన వలన వ్యాధుల భారిన పడతారని చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎపిడి జి.మురళి, ఎ.లక్ష్మునాయుడు, ఎపి ఎం రౌతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.