విజయనగరం

నాతో వచ్చేదెవరు...నిలిచేదెవరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 14: సమస్యలు మీరొక్కరే ఎదుర్కొనడంలేదు. నేను కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అయితే మీరు బయటకు చెప్పుకుంటున్నారు. నేను బయట మీలా చెప్పుకోలేకపోతున్నాను. కలసికట్టుగా ఎమ్మెల్యేను అడుగుదామంటే ఏ ఒక్కరు ముందుకురారు. ఇకనైనా నాతో వస్తానంటే ఎమ్మెల్యేను అడుగుతాను. దీనికి మీరు సిద్ధమా అంటూ గజపతినగరం ఎంపిపి గంట్యాడ శ్రీదేవి మంగళవారం పార్టీ సమావేశంలో అన్న మాటలు ఇవి. ఆమె అంత ఆవేదనగా పై మాటలు వెళ్లగక్కడానికి గల కారణమేమిటంటే మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయలో పార్టీ మండల సమావేశం అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలోనే కాస్త పక్కదారి పట్టింది. ఎవరికివారు తమ ఆవేదనను వెళ్లగక్కడం మొదలుపెట్టారు. పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు దగ్గర నుండి ఎఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, పిడిశీల సర్పంచ్ అప్పలనాయుడు ఇలా అందరిదీ ఒక్కటే ఆవేదన. అధికార పార్టీలో ఉన్నామనే పేరే తప్ప ప్రతి పక్ష పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కన్నా దారుణంగా ఉంది మా పరిస్థితి అంటూ ఎంపిపి శ్రీదేవి ఎదుట ఎకరువు పెట్టారు. ఇలాగైతే ఓడిఎఫ్ కింద మరుగుదొడ్లు నిర్మాణాలు ఎలా చేపట్టగలమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిఎఫ్ పనులకు తరలించే ఇసుకను సైతం పట్టుకుని కేసులు రాస్తున్నారని అధికారులు మామాట వినడంలేదంటూ గగ్గోలు పెట్టారు. దీనికి స్పందిస్తూ ఎంపిపి శ్రీదేవి పై విధంగా ప్రసంగించారు. ఎంపిపి శ్రీదేవి మాటలకు అందరు మద్దతు పలికారు. ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు రాగానే ఆయన దృష్టికి సమస్యలు తీసుకు వెళ్లి పరిష్కారానికి పట్టుపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఆర్ ఐ సంజీవరావును అక్కడికి రప్పించి ఇసుక ఇబ్బందులపై ఎంపిపి శ్రీదేవి నిలదీశారు. కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు మజ్జిగోవింద, ఎంపిటిసిలు కర్రి శ్రీదేవి, మైథిలీప్రియాంక పలువురు పాల్గొన్నారు.