విజయనగరం

విద్యార్థులకు విషయపరిజ్ఞానం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, నవంబర్ 18: విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన అవసరమని, అలాగే దానిని ఇతరులకు తెలియజేయగలిగే పరిస్థితి కలిగి ఉండాలని జిల్లా న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎ. గిరిధర్ అన్నారు. మండల కేంద్రమైన గంట్యాడలో వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయసేవల అవగాహన సదస్సు శనివారం జరిగింది. జాతీయ న్యాయసేవా వారోత్సవాలలో భాగంగా ఇంటింటికి ఉచిత న్యాయసేవలపై విస్తృత ప్రచారంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా జడ్జీ గిరిధర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా సత్వరమే కేసులు పరిష్కారం అవుతాయని అన్నారు.రాజీయే రాజమార్గం అన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అనంతరం గంట్యాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా జడ్జీ గిరిధర్ తనిఖీ చేసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తప్పనిసరిగా తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి వౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు. డిజిటల్ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కెజిబివి పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనాల నాణ్యత, బోధనా తీరును ప్రశ్నించారు. ఆర్వో వాటర్ ప్లాంట్, క్రీడాసామాగ్రి మంజూరు చేయాలంటూ కెజిబివి విద్యార్థినులు ముక్తకంఠంతో కోరారు. దీనికి స్పందించిన జిల్లా జడ్జీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జీ భీమారావు, సీనియర్ సివిల్ జడ్జీ ఎం. శ్రీహరి, పేనల్ అడ్వకేట్ మెంబర్ ఈశ్వరరావు, తహశీల్దార్ నీలకంఠం, ఎస్సై నారాయణరావు, వరల్డ్‌విజన్ జిల్లామేనేజర్ పట్టాపు శ్యామ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కఠిన శిక్షలతోనే బాలికలకు రక్షణ

విజయనగరం(పూల్‌బాగ్),నవంబర్ 18:బాలికలపై అత్యాచారాలు లైంగిక దాడులకు సంబంధించి మానవమృగాలను కఠినంగా శిక్షించినప్పుడే బాలికలకు లైంగిక వేదింపులనుండి రక్షణ ఏర్పడుతుందని రాష్టమ్రహిళా కమీషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి అన్నారు.శనివారం వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జరిగిన బాలికలపై లైంగికవేదింపులు-రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సుజరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చిన్న వయస్సులోనే ప్రేమలోపడటం, సామాజిక మాధ్యమాలద్వారా ఆకర్షితులు కావడం, సంప్రదాయంగాలేని దుస్తులు ధరించడం వంటి పలుకారణాల వల్ల వారిపై లైంగికదాడులకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు.బాలికలు చదువుపైనే శ్రద్ధ పెట్టి చదువుకోవాలని సూచించారు. ఈసదస్సులో జిల్లా విద్యాశాఖాదికారిణి అరణకుమారి, సభ్యులు అప్పారావు,లక్ష్మి పాల్గొన్నారు.