విజయనగరం

గిరిజనాభివృద్ధే ప్రభుత్వ థ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, నవంబర్ 18: గిరిజనాభివృద్ధే ప్రభుత్వ థ్యేయమని స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. పట్టణంలోని పుణ్యగిరి గ్రామంలో గిరిజనులకు శనివారం జరిగిన దోమతెరలు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ఎక్కువ కావడంతో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె అన్నారు. గిరిజనులను ప్రోత్సహిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. అనంతరం కొట్టాం పిహెచ్‌సి మెడికల్ అధికారి గ్రామంలో ప్రకటించి వైద్య సేవలు అందించారు. జ్వరాలతో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి వెంకన్న, స్థానిక ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, కొట్టాం పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు సర్వేపల్లి విద్యార్థి ఎంపిక
శృంగవరపుకోట, నవంబర్ 18: పట్టణంలోని సర్వేపల్లి పాఠశాలలో చదువుతున్న బి.యోగేష్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ ఎం పైడిరాజు తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఈ నెల కర్నూలులో జరిగిన ఆటియాపాటియా క్రీడలలో తమ పాఠశాల విద్యార్థి యోగేష్ రాష్టస్థ్రాయి పోటీలలో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకు చెన్నైలో జాతీయ స్థాయి పోటీలలో యోగేష్ పాల్గొంటాడని తెలిపారు. ఎంపికైన విద్యార్థిని కరస్పాండెంట్, పాఠశాల సిబ్బంది అభినందించారు.

మొక్కలతోనే కాలుష్య నివారణ

నెల్లిమర్ల, నవంబర్ 18: మొక్కలను నాటడం వలన కాలుష్యాన్ని నివారించవచ్చు అని నెల్లిమర్ల నగర పంచాయితీ సీనియర్ అసిస్టెంట్ ఎస్.రవికుమార్ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కార్మికుల అమరవీరుల భవనం వరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అడవులు నరికివేయడం వలన కాలుష్యం పెరిగిపోతుందని అన్నారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వలన మానవాళి మనుగడ కష్టతరంగా మారిందని తెలిపారు. కాలుష్య నివారణకోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని చెప్పారు. మొక్కలు నాటడంతోపాటు వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.