విజయనగరం

బాలికల రక్షణకే మహిళా రక్షక్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 18: బాలికల రక్షణకోసమే మహిళా రక్షక్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని గజపతినగరం పోలీస్ స్టేషన్ ఎ ఎస్సై శ్రీనివాసరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక షిర్డిసాయి జూనియర్ కళాశాలలో మహిళా రక్షక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలో విద్యార్థులతోపాటు ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బాలికలు తమ సమస్యలను ఈ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని అవసరమైతే తమను సంప్రదించాలని అన్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్‌సి నాయుడు, మహిళా కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి గ్రంథాలయాలు దోహదం

బొండపల్లి, నవంబర్ 18: దేశాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని రసాయనశాస్త్ర అధ్యాపకులు ఆర్నిపల్లి సింహాచలం నాయుడు అన్నారు. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం మండలంలోని గొట్లాం గాయత్రి జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు-గ్రంథాలయాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు బి.మురళి, గ్రంథాలయ సంఘం సభ్యుడు అబ్దుల్ రవూఫ్, సి.హెచ్.పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ కోసం కోర్టును ఆశ్రయించిన వృద్ధులు

బొండపల్లి, నవంబర్ 18: పింఛన్ మంజూరు చేయండి అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం కానరాకపోవడంతో ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన వృద్ధులు కోర్టును ఆశ్రయించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన కొవ్వాడ అప్పలనాయుడు, కోరాడ చంద్రనాయుడు, రామునాయుడు, దాసరిరామునాయుడు, వెలుదుర్తి సత్యంలు గజపతినగరం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈసందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ ఆధార్ కార్డులో పింఛన్ మంజూరుకు అర్హత ఉన్నా అధికారులు తాత్సారం చేస్తున్నారని దీంతో న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని కోరారు.