విజయనగరం

ఆధునిక వ్యవసాయ పద్థతులు రైతులకు చేరువ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 18: ఆధునిక వ్యవసాయ సాగుపద్దతులు రైతులకు చేరువ చేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులపై ఉందని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆత్మాకమిటీ చైర్మన్ అట్టాడలక్ష్మునాయుడు అన్నారు. శనివారం గజపతినగరం సబ్‌డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన ఆత్మా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకోసం రూపొందించడంతోపాటు వాటిని రైతులకు చేరువ చేసినపుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. రైతులు ఇంకా పాత వ్యవసాయసాగు పద్ధతులనే అవలంభిస్తున్నారని, దీనివలన రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండడంలేదని అన్నారు. ఆధునిక సాగు యంత్ర పరికరాలను ఉపయోగించి పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెరిగేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. అందుకోసం ఏమి అవసరమో గుర్తించి నివేదికులను అధికారులు ఇవ్లాని అన్నారు. కార్యక్రమంలో ఎడి ఎ ఆర్. అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి టి.సంగీత, ఆసుపత్రికమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, సభ్యులు పాల్గొన్నారు.

మమ్ములను ఆదుకోండి మహాప్రభో

లక్కవరపుకోట, నవంబర్ 18: చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవిస్తూ మార్కాండే పద్మసాలి, చేనేత సంక్షేమ సేవా సంఘం ఎస్.కోటవారి ఆధ్వర్యంలో మండలంలోని చేనేత కార్మికులు అందరు శనివారం స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బొడ్డు సూర్యారావుమాట్లాడుతూ ఎస్.కోట నియోజకవర్గంలో 15వేల జనాభా కలిగి ఉన్న చేనేత కుటుంబాలలో నూటికి 90శాతం మంది పేదవారిగా మిగిలి ఉన్నారని, జీవనోపాధి మెరుగుపరచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను తమ వర్గానికి అందించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ద్వారా తెలియజేశారు. వృద్ధాప్య పింఛన్లను, ఇళ్ల స్థలాలు, గృహాలు అర్హులైనవారికి వెంటనే మంజూరుచేయాలని, పుణ్యగిరిరోడ్డులో కమ్యూనిటీ భవనం నిర్మాణం చేయాలని తదితర డిమాండ్లను ఆమె ముందుంచామని, దీనికి ఆమె స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల అధ్యక్షుడు సోమశెట్టి గణపతి, వేపాడ మండలాధ్యక్షులు, నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల చేనేత కార్మికులు పాల్గొన్నారు.