విజయనగరం

కొత్త గ్రంథాలయాలకు కోటీ 26లక్షలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 18: జిల్లాలో కొత్తగా నిర్మించనున్న గ్రంథాలయ భవనాల నిర్మాణాలకు కోటీ 26లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి. ఎస్.సూర్యనారాయణమూర్తి అన్నారు. శనివారం గజపతినగరం శాఖా గ్రంథాలయాన్ని జిల్లా కార్యదర్శి సూర్యనారాయణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గజపతినగరం, వేపాడ, ఎస్.కోట, బాడంగి, సీతానగరం,మెరకముడిదాం, గరివిడి, దత్తిరాజేరు,నెల్లిమర్ల, భోగాపురం,రామభద్రపురం మండలాలకు కొత్త్భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. గజపతినగరానికి 12లక్షల 60వేల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. కొత్తగా మంజూరైన భవనాలు ఈ నెలాఖరునాటికి నిర్మాణాల ప్రారంభం కానున్నాయని చెప్పారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాలకు రెండేసి వంతున కంప్యూటర్లు మంజూరు చేయడంతోపాటు అంతర్జాల సదుపాయం కల్పిస్తామని అన్నారు. అదే విధంగా పాఠకులు కోరిన పుస్తకాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల నిధులు మంజూరు చేశామని చెప్పారు. కంప్యూటర్లు ఏర్పాటు చేసిన చోట నెట్‌లో కావాల్సిన పుస్తకాలు, సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా గ్రంథాలయాలో కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం. త్రినాథరావు పాల్గొన్నారు.

లక్ష్యాన్ని చేరుకోకపోతే చర్యలు తప్పవు

గజపతినగరం, నవంబర్ 18: గ్రామాలలో మరుగుదొడ్లు నిర్మాణాలకు సంబంధించి తీసుకున్న లక్ష్యాలు చేరుకుని పూర్తిచేయాలని లేకపోతే గ్రామప్రత్యేక అధికారులపై చర్యలు తప్పవని మండలప్రత్యేక అధికారి జిల్లా ఆత్మాప్రాజెక్టు డైరెక్టర్ ఎం. ఆశాదేవి హెచ్చరించారు. శనివారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలకు నిర్ధేశించిన లక్ష్యాలు డిసెంబర్ 15వ తేదీలోగా పూర్తిచేయాలని అన్నారు. అందుకోసం గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పించి నిర్మాణాలకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. అలాగే ప్రతి బుధవారం నిర్వహించే పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరు పూర్తిసమాచారంతో రావాలని చెప్పారు. కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు మెమోలు ఇవ్వడంతోపాటు అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. అధికారులు మొక్కుబడిగా తీసుకుంటున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో తహశీల్దార్ బి. శేషగిరిరావు ఎంపిడి ఒ ఎస్.కృష్ణవేణమ్మ, గ్రామీణ నీటిపారుదల శాఖ విభాగం ఎ ఇ దుర్గ్భావానీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.