ఆంధ్రప్రదేశ్‌

22 చోరీల్లో నలుగురు నిందితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20 తులాల బంగారం స్వాధీనం
* త్వరలో మహిళా రక్షక్
* ఎస్పీ పాలరాజు
విజయనగరం, నవంబర్ 22: విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో 22 చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ పాలరాజు తెలిపారు. బుధవారం ఎస్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు జిల్లాలో 22 నేరాలకు పాల్పడిన నలుగురు నిందితుల నుంచి 20 తులాల బంగారం, 8 సెల్‌ఫోన్లు, రూ.10వేల విలువైన దుస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కరుమజ్జి శ్రీనివాసరావు అలియాస్ ముత్యాలు, జియ్యమ్మవలస మండలం భట్లభద్ర గ్రామానికి చెందిన తామాడ సంతోష్ అలియాస్ నూకరాజు, మెరకముడిదాం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు, విజయనగరంలోని పూల్‌బాగ్‌కు చెందిన పట్నాన సంతోష్‌కుమార్ ఉన్నారు. వీరిలో కరిమజ్జి శ్రీనివాసరావు నుంచి ఒక సెల్‌ఫోన్, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తామాడ సంతోష్ నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లెంక అప్పలరాజు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.1100 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌కుమార్ నుంచి రూ.10వేల విలువైన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా జిల్లాలో 21 కేసులకు సంబంధించి కోల్పోయిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులను ఛేదించడంలో సిసిఎస్ డిఎస్పీ ఎఎస్ చక్రవర్తి, బొబ్బిలి డిఎస్పీ సౌమ్యలత, టూటౌన్ సిఐ రఘు శ్రీనివాస్, ఎస్సైలు భాస్కరరావు, కెఎస్‌జిఎస్‌ఎన్ నాయుడు, కాంతికుమార్, పాపారావు, సన్యాసిరావు, నాయుడులను ఎస్పీ అభినందించారు.
త్వరలో మహిళా రక్షక్
జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో మహిళా బీట్‌లను ఏర్పాటు చేశామన్నారు. దాంతోపాటు ముఖ్య కూడళ్లలో మహిళా రక్షక్ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీరు ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో మహిళలను వేధించే ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇక జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా అన్ని రూట్లలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు చక్రవర్తి, సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు.

పేదలకు పౌష్టికాహారం అందించడమే కమిషన్ లక్ష్యం
- ఎల్‌బి వెంకటరావు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 22: రాష్ట్రంలో నిరుపేదలు, మహిళలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే రాష్ట్ర ఆహార కమిషన్ లక్ష్యమని ఎల్‌బి వెంకటరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జెడ్పీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర ఆహార కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేసిన తరువాత ఆహార భద్రత అనేది ప్రజల హక్కుగా మారిందన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందించాల్సి ఉందన్నారు. తమ కమిషన్ పరిధిలో రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు అందినా స్వతంత్రంగా దర్యాపు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పేదలకు రేషన్ పంపిణీలో అన్యాయం జరిగిన వారికి దక్కాల్సిన సరకులు అందకపోయినా కమిషన్ వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కమిషన్ తరపున జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్-2 డిజిఆర్‌ఒగా వ్యవహరిస్తారని, క్షేత్ర స్థాయిలో తహశీల్దార్, ఐసిడిఎస్ పిఒలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకానికి నాణ్యమైన బియ్యం అందించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మేనేజర్ రామచంద్రరావును ఆదేశించారు. కాగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సన్న బియ్యం సేకరించి ఇక్కడ వసతిగృహాలు, మధ్యాహ్నా భోజన పథకం, అంగన్‌వాడీలకు అందజేస్తామన్నారు. ఫిర్యాదులు ఉంటే మొబైల్ నెం.7989256136 సమాచారం అందించాలన్నారు. సమావేశంలో జెసి-2 నాగేశ్వరరావు, డిఎస్‌ఒ శాంతికుమారి, జిల్లా మేనేజర్ రామచంద్రరావులు పాల్గొన్నారు.

3న పిటిసిలో మాస్టర్ అద్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఎంపిక

విజయనగరం, నవంబర్ 22: మాస్టర్ అద్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే నెల 3న పోలీసు శిక్షణ కళాశాలలో ఎంపిక ఉంటుందని పిటిసి ప్రిన్సిపల్ రాజశిఖామణి తెలిపారు. 35 ఏళ్లు నిండిన స్ర్తి, పురుషులు అందరు అర్హులని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు వచ్చే ఏడాది జనవరి 6, 7, 8 తేదీల్లో శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర మాస్టర్ అద్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని జిల్లా మాస్టర్ అద్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఎస్.పాత్రుడు, కార్యదర్శి శ్రీనివాసరావులు తెలిపారు.

మరో 15 రోజుల్లో ధాన్యం సేకరణ
* జెసి లఠ్కర్

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 22: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ లఠ్కర్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 18 ప్రకారం జిల్లా సేకరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి రవాణా ధరలనుఖరారు చేశామన్నారు. రవాణాశాఖ తాజాగా రూపొందించిన ధరల ప్రకారం ఈ ఏడాది ధరలను నిర్ణయించినట్టు చెప్పారు. దీని ప్రకారం విజయనగరం డివిజన్‌లో ఒక మెట్రిక్ టన్ను ధాన్యం రవాణాకు కిలోమీటరుకు గత ఏడాది రూ.265 చెల్లించగా, ఈ ఏడాది రూ.253గా నిర్ణయించామన్నారు. పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి గత ఏడాది టన్నుకు రూ.272 కాగా ఈ ఏడాది రూ.266 ధర నిర్ణయించామన్నారు. తాజాగా సవరించిన ధరల వల్ల ప్రభుత్వానికి ధాన్యం రవాణాకు రూ.1 నుంచి రూ.1.50 కోట్ల మేరకు ఆదా అవుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో 152 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. గత ఏడాది లోటుపాట్లు గుర్తించిన 20 కేంద్రాల స్థానంలో ప్రత్యమ్నాయంగా మరో 20 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం సేకరణకు జిల్లాలో కోటి గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌ఒ రామచంద్రరావు, ఆర్డీవో మురళీ, డిఆర్‌డిఎ పిడి కె.సుబ్బారావు, ఎంవిఐ దుర్గాప్రసాద్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శివ, లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రులు ఉన్నా అభివృద్ధి ఎక్కడ!

* జిల్లా వైకాపా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్

బొండపల్లి, నవంబర్ 22: జిల్లాకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్నా అభివృద్ధి ఎక్కడ చేశారని జిల్లా వైకాపా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. రచ్చబండ, పల్లెనిద్రలో భాగంగా మండలంలోని దేవుపల్లి గ్రామంలో మంగళ, బుధవారాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు జిల్లాను అభివృద్ధి చేయకపోగా విజయనగరంలోని తన కోటకు అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. మరోమంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వై ఎస్సార్ తరపున గెలిచి టిడిపిలో పదవి పొందారని ఆరోపించారు. వై ఎస్ జగన్ పాదయాత్ర ద్వారా పల్లెసీమలలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు తెచ్చిన గిరిజన యూనివర్సిటీ ఏమైందని బెల్లాన మంత్రులను ప్రశ్నించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ శాసన సభలో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వని ఫలితంగానే జగన్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారని అన్నారు.జన్మభూమి కమిటీలు కమిషన్లకు కక్కుర్తిపై అర్హులకు పథకాలు అందకుండాచేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంలో టిడిపి నేతలు అందివేచిన చెయ్యి అని అన్నారు. కాగా మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య జిల్లా వైకాపా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపిపి రాపాక సూర్యప్రకాశరావు, సీనియర్ పార్టీ నాయకులు నారాయణమూర్తిరాజు, వర్రి నర్సింహమూర్తి, జైహింద్‌కుమార్, గారతవుడులు పల్లెనిద్ర చేశారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు తాళ్లపూడి కృష్ణ, మండల కన్వీనర్లు ఈదుబిల్లి కృష్ణ, బూడి వెంకటరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు చెల్లా చెల్లంనాయుడు, వైకాపా నాయకులు బి.వి.ప్రభూజీ, బండారు బంగారం తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌కమిషనర్‌గా రవీంధ్ర

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 22: విజయనగరం మున్సిపల్ కమిషనర్‌గా వి.రవీంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత్తం రవీంద్ర గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూవిభాగం)గా పనిచేస్తున్నారు. గత కొన్నినెలల నుంచి విజయనగరం మున్సిపల్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన జి.నాగరాజు దీర్ఘకాలిక శెలవులో వెళ్లడంతో బొబ్బిలి భూసేకరణ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌డి అనితను ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించారు. ఇక్కడికి మున్సిపల్ కమిషనర్‌గా రావడానికి ఎవరూ ఇష్టపడటంలేదు. ఈ కారణంగానే ఇంతవరకూ అనితకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* హెల్డ్ ఎడ్యుకేటర్ అనిల్ ప్రేమకుమార్

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 22: దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్ ప్రేమకుమార్ అన్నారు. పట్టణంలో పూల్‌భాగ్‌కాలనీలో మొబైల్ మలేరియా, డెంగ్యూ బృందం బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ నిల్వనీరు దోమలకు నిలయాలుగా మారి దోమల వ్యాప్తి చెందడానికి వ్యాధి కారకాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడిస్ ఈజిప్ట్ అనే దోమ పగటిపూట మాత్రమే కుడుతుందని, ఈ దోమల వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని తెలిపారు. ఈడిస్ ఈజిప్ట్ దోమ మంచినీటినిలోనే పెరుగుతుందని, మురుగునీటిలో పెరగదని చెప్పారు. ఈ దోమ జీవితకాలంలో 400 మీటర్లకు మించి ప్రయాణం చేయలేదని అన్నారు. కండ్ల నొప్పి,శరీరంపై చిన్నపాటి రద్దుర్లు డెంగ్యూ జర్వం లక్షణాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, ముక్కు నుంచి రక్తస్రావం, అపస్మారక స్థితికి వచినట్లు అనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని కోరారు. డెంగ్యూ జ్వరంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండటం వచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ రాజకుమారి, ఫైలేరియా ఇన్‌స్పెక్టర్లు వివిఎస్‌ఆర్ ప్రసాద్ , జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీ తొలగింపుపై వాగ్వివాదం

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 22: పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించడంతో ఎన్‌టిఆర్ ఫ్యాన్స్ అభిమానులు, టిడిపి నాయకులు వాగ్వివాదానికి దిగారు. తాము ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించడంలేదని, టిడిపి నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారని వారు వాపోయారు. ఈ మేరకు మున్సిపల్ అసిస్టంట్ సిటీప్లానర్ వి.శోభన్‌బాబుతో వారు వాగ్వివాదానికి దిగారు. నిబంధనల మేరకే ఫ్లెక్సీలను తొలగించామని శోభన్‌బాబు సర్ది చెప్పినప్పటికీ వారు వినలేదు. టిడిపి నాయకులు వ్యహరించిన తీరుపై మున్సిపల్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో
అవకతవకలు జరిగితే కఠిన చర్యలు
*కలెక్టర్ వివేక్ యాదవ్
మెరకముడిదాం, నవంబర్ 22: మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకులు జరిగితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. బుదవారం నాడు గర్భాం ఎస్‌సి వీధిలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను మండల అధికారులతో కలెక్టర్ పరిశీలించారు. డిశెంబర్ 15 నాటికి నిర్మాణ దశలో ఉన్న అన్ని మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని మండల అధికారులను ఆదేశించారు. నిర్మాణం జరిపిన రెండురోజులకే లభ్దిదారుని అకౌంట్‌కి బిల్లు జమ కావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదిన ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని నిర్మాణం జరిపిన తక్షణమే బిల్లులు చెల్లించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తయారు చేయడానికి జిల్లా ప్రజలు అధికారులు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై వివేఖరులు ఆయను ప్రశ్నించగా వీటి నిర్మాణంలో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మణరావు, ఎంపిడిఒ త్రినాధరావు, తహశీల్దారు ఎంవిరమణమూర్తి, పలవురు అధికారులు పాల్గొన్నారు.