విజయనగరం

బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 23: బాలికల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఐసిడిఎస్ విజయనగరం అర్బన్ ప్రాజెక్టు అధికారి శ్రీదేవి అన్నారు. కిశోర్ వికాస్ పధకం ద్వారా పలు అంశాలలో కిశోర బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. దీనిలోభాగంగా శిక్షణా కార్యక్రమం ర్యాలీని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలోను ముందంజంలో ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒకవైపుఉన్నత విద్యలో ప్రొత్సహించడంతోపాటు మరోవైపు ఆర్థికంగా బలోపేతం చేసెందుకు అన్నివిధాలా ప్రొత్సహం అందిస్తుందన్నారు. ముఖ్యంగా 11 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న కిశోర బాలికలకు ఆశ్రమ పాఠశాలల, కస్తూరిబా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు బాలికలు కృతనిశ్చయంతో ఉండాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు కుసుమకుమారి, మణికేసరి, సుభాషిణి, రాధిక తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 23: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాలవలవన్‌కు గురువారం ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా విజయనగరం మున్సిపాలిటీ, కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ అయి అనివార్య కారణాల వల్ల మున్సిపాలిటీగా కొనసాగుతున్నందున మున్సిపాలిటీలో పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కార్పోరేషన్ యూనిట్‌గా పరిగణించాలని కోరారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అంగీకరించాలని తెలిపారు. విజయనగరం, మచిలీపట్నం మున్సిపాలిటీలు కార్పోరేషన్‌లుగా మార్చుతు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినందున ఆయా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం పూర్తయ్యేవరకూ స్పెషల్ క్యాటగిరిగా పరిగణిస్తూ నివేదిక తయారు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిష్టష్రన్‌ను ఆదేశించారని చెప్పారు. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సరిచేయాలని, మున్సిపల్ పండిట్, పిఇటి అఫ్‌గ్రేడెషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పిఆర్‌టియు ప్రధాన కార్యదర్శి చిట్టి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.