విజయనగరం

ఆనందసేవలో అభినందనీయం:పతివాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, నవంబర్ 23: ఎయిమ్ గ్రూప్ సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధి థామస్‌పేట గ్రామంలో నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు ఆనంద్ సొంతనిధులతో రేకు ఇళ్లు కట్టించడం హర్షనీయమని అన్నారు. ఇటువంటి సేవాధృక్పధం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఆనంద్‌కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కడగల ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ అందరి ఐకమత్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చునని అన్నారు. ఇంకా గ్రామంలో మిగిలి ఉన్న పూరిపాకల స్థలంలో రేకు ఇళ్లుకట్టించడానికి కృషి చేస్తానని అన్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా థామస్‌పేటలో ఆనందయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు. కార్యక్రమంలో సువ్వాడ వనజాక్షి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, పార్టీ మండల అధ్యక్షులు గేదెల రాజరావు, యువజన విభాగం అధ్యక్షులు బి.చక్రిధర్, నాయకులు బైరెడ్డి నాగేశ్వరరావు, ఆల్తి శ్రీనివాసరావు, వేణు, మజ్జి నాగమణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర

బొండపల్లి, నవంబర్ 23: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామాలలో పల్లెనిద్ర చేపడుతున్నామని స్థానిక ఇన్‌ఛార్జ్ ఎంపిడిఒ వి.వి.రవికుమార్ అన్నారు. మండలంలోని ఎం.కొత్తవలస గ్రామంలో పల్లెనిద్ర సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల బృందం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపురవీధులలో కొవ్వొత్తులతో ర్యాలీగా పర్యటించి వౌలిక సదుపాయాల కల్పన పరిశీలించారు. తొలుత గ్రామస్తులతో స్వచ్ఛత పాటిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎ ఇ నవీన్, ఐసిడి ఎస్ సూపర్‌వైజర్ గాయత్రిదేవి, పి ఆర్ జె ఇ అప్పలనాయుడు, గొల్లుపాలెం పశువైద్యాధికారి బి.వెంకటరమణ, కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు.