విజయనగరం

సత్యసాయిబాబా ఆశయాలు అందరు అనుసరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 23: సత్యసాయిబాబా ఆశయాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని గజపతినగరం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ పల్లి నాగేశ్వరరావుకోరారు. గురువారం స్థానిక సత్యసాయి సేవా మందిరంలో జిల్లా నాయకులు పొట్టా శ్రీనివాసరావు పర్యవేక్షణలో భగవాన్ సత్యసాయిబాబా 92వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం,్ధర్మం, శాంతి, ప్రేమను ప్రభోధించి సమాజాన్ని ప్రశాంత మార్గంలో నడిపించిన సత్యసాయి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ప్రస్తుత సమాజంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నందుకు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కొంత సమయాన్ని ఆధ్యాత్మికతకు కేటాయించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఆధ్యాత్మికత భావం పెరిగినపుడు శాంతి భద్రతలకు విఘాతం కలగదని అన్నారు. ఉదయం 5 గంటలకు ఓంకారం, నగరసంకీర్తన, 6.30గంటలకు కన్వీనర్ వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన గావించి పుష్పమాలాంకరణ చేశారు. 6.45గంటలకు స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సత్యసాయి పతాకావిష్కరణ గావించారు. అనంతరం రోగులకు అనాదపిల్లలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. 9.30గంటలకు జిల్లా నాయకులు పొట్టా శ్రీనివాసరావు రుద్రాభిషేకం, గోపూజ జరిపారు. సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేక అలంకరణ జీప్‌లో ఉంచి పురవీధులలో(మహానగర సంకీర్తన)తో ఊరేగించారు. ఆరిశెట్టి ప్రసాద్,బుడ్డెపుశ్రీను సౌజన్యంతో భక్తులకు మహానారాయణ సేవ గావించారు. సాయంత్రం అమృతకలశాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.బి.విఠల్, కన్వీనర్ వెంకటేశ్వరరావు, ఆధ్యాత్మిక జిల్లా కన్వీనర్ మానాపురం సత్యారావు, యూత్ సమన్వయకర్త సునీల్‌కుమార్ రథో, రాష్టన్రాయకులు మెట్ట సత్యనారాయణ, సేవా సమితి నేతలు వైకుంఠం ఆదినారాయణ, లోచర్ల మనోహర్, పవన్‌కుమార్, పొట్టా నాదం తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి అలంకరణలో రాజరాజేశ్వరిదేవి

బొండపల్లి, నవంబర్ 23: మండలంలోని దేవుపల్లి గ్రామంలో వెలసిన రాజరాజేశ్వరిదేవి మార్గశిరమాసం గురువారం సందర్భంగా మహాలక్ష్మిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దూసి శ్రీధర శర్మ మాట్లాడుతూ మార్గశిర మాసమంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని ఈ మాసంలో సాక్షాత్తు మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకంలో మానవుల కోర్కెలు తీర్చేందుకు సంచరిస్తుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ మాసంలో అమ్మవారిని దర్శించి ఆలయంలో తులసికుంకుమ పూజలు జరుపుకోవాలని తెలిపారు. ఈరోజు దర్శనానికి వచ్చిన భక్తులకు లక్ష్మీదేవికి ఇష్టమైన పులగం ప్రసాదాన్ని పంపిణీ చేశారు.