విజయనగరం

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 23: జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన విజయనగరం డివిజన్ స్థాయి సమావేశంలో వివిధ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్ధిష్ట కాలపరిమితిలోనే పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి జిల్లాను ఒడిఎఫ్ జాబితాలో చేర్చవలసి ఉన్నందున మరుగుదొడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. జిల్లాలో గ్రామీణ రహదారుల నిర్మాణాలకు రూ.240 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటి వరకు కేవలం 110 కిలోమీటర్ల రహదారులను పూర్తి చేశారన్నారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌డిపి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలోని మెటీరియల్ కాంపొనెంట్‌తో సిసి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ విధానాల ప్రకారం స్థానికంగా అందుబాటులో ఉన్న ఇసుకను వినియోగించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఇసుక సేకరణపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేకమైన ఇసుక కేంద్రం (ఇసుక సెల్) ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 596 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేయగా 120 పూర్తి చేశారని, 450 పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీ నిర్మాణాలు పెద్ద ఎత్తున మంజూరు చేశామన్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. 30 వేల ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశామని, వాటి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉందన్నారు.

పల్లెకు పోదాం..
అధికారులు ‘పల్లెకు పోదాం’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంఅదాలు, పిహెచ్‌సిలు, అభివృద్ధి పనులు తనిఖీ చేయాలన్నారు. గ్రామస్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వపరంగా అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీసు విధానం అమలు చేయాలన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుకు గ్రేడింగ్ ఇస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో అడ్డంకులు సృష్టించే సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఎపిఒలకు షోకాజ్ నోటీసులు
గత నెల రోజులుగా ఫారం పాండ్స్ పనులు ప్రారంభించని ఎపిఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. జిల్లాలో మెంటాడ, నెల్లిమర్ల, మెరకముడిదాం, వేపాడ, ఎస్‌కోట ఎపిఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.అలాగే చెత్త నుంచి సంపద కేంద్రాల పనులు ప్రారంభించని దత్తిరాజేరు ఇఒపిఆర్‌డికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డిపిఒ సత్యనారాయణను ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఒ విజయలక్ష్మి, జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు, ఆర్డీవో మురళీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి, డిడి సునీల్ రాజ్‌కుమార్, డ్వామా పిడి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.