విజయనగరం

తాటిచెట్టు మీదపడి ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, డిసెంబర్ 11: తాటిచెట్టు నరుకుతుండగా ప్రమాదవశాత్తు మీదపడి ద్వారపూడి సంజీవి(63) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గదబవలస గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.సిగడాం మండలంలోని బూటుపేట గ్రామానికి చెందిన మృతుడు సంజీవి తన సహచార కూలీ కూనుబిల్లి సూర్యనారాయణతో కలసి ఇక్కడి గ్రామంలోని తాటిచెట్లు నరికే పనికి వెళ్లాడు. చెట్లను నరుకుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సంజీవిపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడని ఎస్సై ఎస్. శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టంకు తరలించి కేసును దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.
పోలవరం అవినీతిపై ప్రశ్నిస్తే తప్పా!
కొత్తవలస, డిసెంబర్ 11: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న జాతీయ ప్రాజెక్టు పోలవరంలో బినామీ పేరుతో వందలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపిస్తే దానిని ప్రభుత్వం తప్పుగా స్వీకరిస్తుందని వైసిపి నాయకుడు నెక్కలి నాయుడుబాబు మండి పడ్డారు. సోమవారం ఆయన మండల మాజీ ఎంపిపి గొరపల్లి శివ, మండల వైసిపి నాయకులు మేళాస్ర్తీ అప్పారావులతో కలసి విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. పోలవరం ప్రాజెక్టులో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని, వైసిపి ఆరోపించిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుని జగనే అడ్డుకుంటున్నాడని, ప్రజలకు అవాస్తవాలు చెప్పి చంద్రబాబు నమ్మిస్తున్నాడని తెలిపారు. కేంద్రప్రభుత్వం తాజాగా నిధులు నిలుపుదల చేయడంతో జరిగిన అవినీతి బయటపడిందని, పోలవరం ప్రాజెక్టు వాస్తవాలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ కేంద్రం నియమించిందని నాయుడుబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బినామీ పేర్లుతో టెండర్లు దక్కించుకుని సుమారు 140 కోట్ల మేర అవినీతి పాల్పడ్డారని నాయుడుబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి సర్పంచ్‌లు, మండల కన్వీనర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.