విజయనగరం

‘మీ కోసం’కు వినతుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 11: కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సోమవారం జెసి నాగేశ్వరరావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పింఛన్లు, గృహాలు, రేషన్‌కార్డులు, భూ వివాదాలు, ఉపాధి పనులు, రుణాలు మంజూరు చేయాలని విన్నవించుకున్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 11 వినతులు వచ్చాయి. ఇదిలాఉండగా 108 ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు జెవికె సంస్థ ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా పనిచేశామని, ఇపుడు బివిజె సంస్థకు బదలాయిస్తే తమకు రావాల్సిన గ్రాట్యూటీ, ఇతర బకాయిలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు అన్నింటిని ఇప్పించాలని కోరారు. కొమరాడకు చెందిన శంకరరావు మాట్లాడుతూ ఆ మండలంలోని తొడిమ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి పలువురు తమగోడును విన్పించుకున్నారు.
‘దళారులను నమ్మి మోసపోవద్దు’
వేపాడ, డిసెంబర్ 11: ఆరు కాలాలపాటు కష్టపడి పండించిన పంటకు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం మండలంలోని బొద్దాం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను ఆకర్షించే విధంగా దళారీలు ప్రవర్తించి రైతులను తమ వైపు తిప్పుకొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. అలాంటి దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతుధరను రైతులు వినియోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చెప్పారు. దళారీలు తూనికతోపాటు రేటు కూడా తక్కువ ఇచ్చి మోసం చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వం తూకంతోపాటు క్వింటాకు 1550రూపాయలు నుండి 1559 రూపాయల వరకు అందిస్తుంది. కాబట్టి రైతులు గమనించి ఆర్థికంగా లాభపడాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి దాసరి లక్ష్మి గ్రామసర్పంచ్ డి.ముత్యాలమ్మ, మాజీ సర్పంచ్ ఈశ్వరరావు, ఎపి ఎం ఎ.వి.రమణ, ఎం ఆర్ ఒ పెంటయ్య, ఎస్.కోట టిడిపి అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకుడు నాయుడు, వేపాడ మండల మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, నాయకులు పాల్గొన్నారు.
కరాటేలో దానయ్య బంగారు పతకం
భోగాపురం, డిసెంబర్ 11: మండలంలోని తీరప్రాంత గ్రామమైన ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి దానయ్యకు కరాటేలో బంగారు పతకం వరించింది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన డి.జోనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో ఈ పతకాన్ని సాధించానని దానయ్య తెలిపాడు. ఈనెల 22న రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా దానయ్యను ఎంపిపి కర్రోతు బంగారురాజు అభినందించారు.