విజయనగరం

అధికార లాంఛనాలతో సీఆర్‌పిఎఫ్ జవాన్‌కు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, డిసెంబర్ 11: చత్తీష్‌గడ్ బీజాపురం జిల్లాలోని బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 168 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌లో తోటి జవాన్ జరిపిన కాల్పులో మృతిచెందిన గంటా శంకరరావు(38) స్వగ్రామం పోలినాయుడువలస గ్రామంలో సోమవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామమైన పోలినాయుడువలస గ్రామానికి రాత్రి దాదాపు 12గంటల సమయానికి తీసుకువచ్చారు. అనంతరం శంకరరావు పార్థివ్ దేహానికి విశాఖపట్టణం సీ ఆర్‌పీ ఎఫ్ బెటాలియన్ కమెండెంట్ సారాంగు, పార్వతీపురం ఏ ఎస్పీ అమిత్ బర్ధార్, సీఐ రాంబాబు, తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. గ్రామం నుంచి శ్మశానవాటిక వరకు అంతిమయాత్రను నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించడంతో గౌరవసూచికంగా పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. మృతిచెందిన శంకరరావు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని సీఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు.