విజయనగరం

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం: మంత్రి సుజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని, ఇందులో భాగంగా పురపాలక సంఘంలో ప్రాధాన్యత ఉన్న పనులకు ప్రణాళికలు రూపొందించి అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తానని గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. పాతబొబ్బిలి గ్రామ సమీపంలో 26లక్షల 50వేల రూపాయల 14వ ఆర్థిక సంఘం నిదులతో రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రాధాన్యత క్రమంలో పనులను ప్రణాళికల ద్వారా పూర్తిచేస్తామన్నారు. పాతబొబ్బిలి గ్రామస్థులు కోరిన మేరకు మిగిలిన రోడ్డు సగభానికి 10లక్షల రూపాయలు మంజూరుచేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో ప్రతీ ప్రాంతంలోను రోడ్లు, కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా 14వ సంఘం ఆర్ధిక నిదులతో ప్రసాద్‌నగర్ కాలనీ నుంచి సామాలమ్మగుడి వరకు 26లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేస్తున్నామన్నారు. ఈ పనులను అధికారులు వేగవంతం చేయాలని కోరారు. వైస్ ఛైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్డు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు, వార్డు కౌన్సిల్ సభ్యులు లక్ష్మి, హైమావతి, గోవిందమ్మ, కళ్యాణితోపాటు టీడీపీ మండల అధ్యక్షులు రాంబార్కి శరత్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, రామ్మూర్తినాయుడు, తిరుపతిరావు, శ్రీ్ధర్, పార్వతి, పెదరాములు, కమిషనర్ శంకరరావు, డీఇ మహేష్, పాతబొబ్బిలి గ్రామస్థులు పాల్గొన్నారు.