విజయనగరం

కార్మికులను పొట్టన పెట్టుకున్న క్వారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), డిసెంబర్ 12: కూలి డబ్బుల కోసం క్వారీ పనులకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని తిరిగిరాని లోకానికి ఇద్దరు కార్మికులు పయనమయ్యారు. దీంతో కార్మిక కుటుంబీకులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతీ రోజులాగే కూలీకి వెళ్లి తెచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ చేస్తున్న ఆ కార్మికులపై బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. డిఎస్పీ సౌమ్యలత, గ్రామస్థులు అందించిన వివరాల మేరకు బొబ్బిలి మండలం పారాది పంచాయతీ పరిధిలో ఉన్న బంకురువానివలస గ్రామంలో మాంగనీస్ క్వారీ పనులకు మంగళవారం బంకురువానివలస గ్రామానికి చెందిన మరడాన వెంకటరావు(35), లోపింటి అంజయ్య(55)లు వెళ్లారు. మహేశ్వరి మాంగనీస్ క్వారీ కింద మోటార్ పనిచేస్తుండగా ఒక్కసారిగా కార్మికులపై బండరాళ్లు దొర్లిపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం క్వారీ కింద ఉన్న సుమారు 200 అడుగుల లోతులో ఉన్న నీటిని తోడేందుకు మోటార్‌ను ఏర్పాటు చేసేందుకు ఇద్దరు కార్మికులు దిగారు. రెండు రోజులక్రితం క్వారీని పేల్చడంతో పై ఉన్న రాళ్లు ఒక్కసారిగా కిందకు జారడంతో మృతిచెందారని కొంతమంది చెబుతుండగా, మరికొంతమంది స్థానికులు వీరు దిగిన సమయంలో క్వారీలో బ్లాస్టింగ్ చేశారని, దీంతో రాళ్లు పడి మృతిచెందారని చెబుతున్నారు. వెంకటరావుకు భార్య ఉష, ఇద్దరు చిన్నారులు జాప్ని(8), భరత్(6)లు ఉండటంతో వారి రోధన వర్ణణాతీతం. లోపింటి అంజయ్యకు భార్య రాములమ్మ, శ్రీరాములు, పైడిరాజు అనే ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలిసిన వెంటనే బొబ్బిలి డిఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసుల పర్యవేక్షణలో మృతదేహాలను వెలికితీయించి శవపంచనామా జరిపించారు. గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటు లక్ష్మునాయుడు క్వారీ యాజమాన్యంతో చర్చించి కార్మికులకు భద్రత కల్పించాలని, మృతిచెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మహేశ్వరి మైనింగ్ యాజమాన్యానికి నోటీసులు అందించి పనులను నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పార్వతీపురం ఆర్డీఓ బి సుదర్శనదొర, బొబ్బిలి సీఐ రవితోపాటు ఎస్‌ఐ రవీంద్రరాజు ప్రమాదసంఘటనను పరిశీలించి కుటుంబీకులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.