విజయనగరం

వ్యవసాయాధారిత పరిశ్రమలపై మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఇటీవల కాలంలో సింగిల్ విండో విధానం ద్వారా జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో కోస్టల్ ఆగ్రో ఫుడ్స్, వీఎన్‌ఆర్‌డీ ఇండస్ట్రీస్, విఆర్‌డి ఇండస్ట్రీస్ కంపెనీలు చాక్లెట్‌లను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. చీపురుపల్లిలోని బిపి వరకట్టు దగ్గర నార్త్ కోస్తల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్కు నెలకొల్పేందుకు మరో పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చారన్నారు. బొండపల్లి మండలం మరుపల్లిలో చందన డైయిరీ ఏర్పాటు చేసేందుకు వైటీవీ ఎండీ ముందుకు వచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ చెప్పారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాలు సేకరించామన్నారు. వీటిలో విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం, నెల్లిమర్ల నియోజకవర్గంలో కందివలస, గజపతినగరంలో మరుపల్లి, ఎస్.కోట నియోజకవర్గంలో బలిఘట్టం ప్రాంతాల్లో భూమి సిద్ధంగా ఉందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి,కురుపాం నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్‌ఎంఇ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరలో పది పరిశ్రమల ఏర్పాటు
జిల్లాలో మరో ఆరు నెలల్లో కొత్తగా ఏడు మెగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సుమారు రూ.625 కోట్లతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వాటిలో బోగాపురంలోని రూ.33 కోట్లతో కెమిరా ఇండస్ లిమిటెడ్, రూ.100 కోట్లతో బొబ్బిలిలోని కార్బన్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ రెండు యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అలాగే రూ.50కోట్లతో గరివిడిలో మెసెర్స్ రిచ్‌మండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కానుందన్నారు. ఇదిలా ఉండగా ఎల్‌కోటలోని మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రాజెక్టు రూ.80కోట్లతో ఆ ప్రాజెక్టును విస్తరించనుందన్నారు. ఎల్‌కోటలోని శ్రీరాంపురంలో రూ.330.7 కోట్లతో సింహాద్రి పిల్లెట్స్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందన్నారు.
ఉత్పాదక రంగాల్లో వృద్ధి సాధించాలి

విజయనగరం, డిసెంబర్ 12: రాష్ట్ర విభజన తరువాత అందరి సమష్టి కృషితో నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉత్పాదక రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడం, కొత్త పరిశ్రమల స్థాపనకు అవరమైన అనుమతులు, వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయాలన్నారు. తలసరి ఆదాయం 1.23 లక్షలు ఉందని, దీన్ని మరొక రూ.58 వేలకు పెంచాలన్నా. వ్యవసాయానుబంధ రంగాల్లో 25.6 శాతం స్థూల ఆదాయం సాధించడం, ప్రస్తుతం వ్యవసాయం కంటే ఉద్పాదక విభాగంలో ఉపాధి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. అన్ని శాఖల ప్రగతిని డ్యాష్ బోర్డులో పొందుపరచాలన్నారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం, కంప్యూటరీకరణ చేస్తు న్నామన్నారు. ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఇంటర్నెట్, వైఫై సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
2 నుంచి జన్మభూమి
జన్మభూమిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలను తక్షణమ పరిష్కరించాలని న్నారు. జనవరి 2 నుంచి జన్మభూమి -మావూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జన్మభూమిలో ప్రధానంగా పది అంశాలపై చర్చ జరగాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్, జెసి లఠ్కర్, జెసి నాగేశ్వరావు, సిపి విజయలక్ష్మి, డిడి లక్ష్మనారాయణ, జెడి వె. సింహాచలం, డిఎఫ్‌ఓలు లక్ష్మణ్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణాలపై విస్తృత ప్రచారం

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలపై విస్తృత ప్రచారం చేయాలని జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన జెడ్పీలో తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల సదుపాయం లేనివారు కొత్తగా వాటిని నిర్మించుకునేందుకు ఈ నెల 27 వరకు గడువు ఉందన్నారు. ఆ లోపల నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. జిల్లాను ఒడిఎఫ్ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తున్నందున ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి సదుపాయం ఉండేలా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎప్పటికపుడు చెల్లింపులు ఎలా జరపాలనే అంశంపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై గ్రామాల్లో సంబంధిత అధికారులు విధిగా పర్య వేక్షించాలన్నారు. డీడీయు ప్రోగ్రాం అధికారి జీవన్‌బాబు, స్వచ్ఛ భారత్ మెంబర్ సెక్రటరీ,ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి, వివిధ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
నేడు మంత్రి సుజయ్ ప్రజాదర్బార్
విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు బుధవారం జిల్లా పరిషత్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై ప్రజా దర్బార్‌లో వినతులు అందజేయాలని ఆయన కోరారు.
పార్టీ నేతలతో
బాబు వీడియో కాన్ఫరెన్స్

విజయనగరం, డిసెంబర్ 12: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు మాట్లాడుతూ నీరు-చెట్టు బిల్లులు చెల్లింపులు జరగలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాల్టీలో ప్రైవేటు పారిశుద్ధ్యంనకు సంబంధించిన బిల్లు ఎంత వరకు వచ్చిందని ఎమ్మెల్సీ జగదీష్ అడిగారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ టెండర్లు పిలిచామని, జిఒ 279 ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కురుపాం, బలిజపేట, విజయనగరం, చీపురుపల్లి, బోగాపురం, పాచిపెంట మండలాల్లో మండల సమావేశాలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కార్యకర్తల శిక్షణ తరగతుల హాజరు తక్కువగాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా , జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, ఎస్‌ఎన్‌ఎం రాజు తదితరులు వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నాలు
పార్వతీపురం, డిసెంబర్ 12: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపో ఆవరణలో ఎంప్లారుూస్, ఎన్‌ఎంయు యూనియన్ నేతల ఆధ్వర్యంలో విడిడిగా మంగళవారం ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల యూనియన్ నేతలు మాట్లాడుతూ మోటార్ వెహికల్స్ యాక్టు ప్రకారం డిపోలో ఉన్న ఓటీ డ్యూటీలకు రన్నింగ్ టైమ్ పెంచి అందుకు అనుగుణంగా ఓటీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా కండక్టర్లకు ప్రత్యేక చార్టు వేయాలని, పాత టిమ్ మిషన్లు సరిగా పనిచేయనందున కొత్త టిమ్ మిషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన (డిజ్ ఎంగేజ్ చేసిన) ఎస్సీ, ఎస్టీ డైవర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిక్ అయిన వారికి జీతాలు చెల్లించాలని, 2 గంటల సమయానికి మించి ఓటీ షెడ్యూల్ రద్దు చేయాలన్నారు. ఈధర్నాల్లో భాగంగా ఎంప్లారుూస్ యూనియన్ నేత మరిపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎన్‌బి రావు, గొట్టాపు శ్రీనివాసరావు, ఎన్‌ఎంయు రీజనల్ కార్యదర్శి బిఎస్ రాములు ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌వి రావు, ఏఎస్పీ బాబు సారథ్యంలో ఆయా సంఘ కార్మికులు ధర్నాలు నిర్వహించారు.