విజయనగరం

గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, డిసెంబర్ 14: విజయనగరం జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి సూర్యనారాయణమూర్తి అన్నారు. గురువారం ఎల్.కోట గ్రంథాలయానికి వచ్చిన ఆయన గ్రంథాలయ కమిటీతోపాటు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 10శాఖా గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు 65లక్షల రూపాయలతో ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. వీటికోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ వీటిని త్వరలోనే నిర్మిస్తామని అన్నారు. ప్రతి గ్రంథాలయంలో కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తామని, దీనికోసం 13లక్షలు కేటాయించామని అన్నారు. పాఠకులు సంవత్సరానికి 150 రూపాయలతో ఐదు రూపాయలకే గంట ఇంటర్నెట్‌ను వాడుకునే సదుపాయం కల్పిస్తామని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో విద్యుత్ అంతరాయం రాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 11.35లక్షలు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి శాఖా గ్రంథాలయంలో పాఠకులు అడిగే పుస్తకాలను కొనేందుకు ఆరులక్షలతో నిధులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గ్రంథాలయంలో పాఠకులు సందర్శించేందుకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శితోపాటు ఎల్.కోట గ్రంథాలయశాఖ అధికరి శ్రీధర్ పాల్గొన్నారు.

పశువుల బీమా పథకం పునరుద్ధరణ
* పశుసంవర్థశాఖ రాష్ట్ర అదనపుసంచాలకులు దామోధరరావు

గంట్యాడ, డిసెంబర్ 14: పాడిరైతుల సంక్షేమం కోసం పశువుల బీమా పథకం పునఃప్రారంభం కానున్నదని దీనికి సంబంధించి నెలాఖరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నదని పశుసంవర్థకశాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు ధామోధరరావు తెలిపారు. గురువారం గంట్యాడ లోని ప్రాంతీయ పశువైద్యశాలన ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ 50శాతం రాయితీతో పశుసంవర్థకశాఖ ద్వారా పశువుల బీమాపదకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నదని చెప్పారు. ఈ పథకం కొంతకాలంగా నిలిచిపోవడంవలన పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 2017-18 సంవత్సరంలో రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ల ద్వారా 40వేల పాడి పశువులను రైతులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా పదివేల పశువుల పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది రబీసీజన్‌లో 30వేల ఎకరాలలో పశుగ్రాసం పెంపకానికి చర్యలుచేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే మెగా పశుగ్రాస క్షేత్రాల పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టామని చెప్పారు. ఆసక్తి కలిగిన పెద్దరైతు, సమీప ప్రాంతంలోని చిన్నరైతులతో కలసి ఈ పథకం ద్వారా పశుగ్రాసాలను పెంచుతారని తెలిపారు. పశుగ్రాసాలను మరింత ఎక్కువగా పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో 354 పశువైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ డిడి జగన్నాథం,జెడి సింహాచలం, గంట్యాడ ఎడి రెడ్డి కృష్ణ పశువైద్యాధికారులు పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా నరవ, బోనంగి గ్రామాలలోని పశువైద్య కేంద్రాలను ఆయన తనిఖీచేసి పలువిషయాలపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.