విజయనగరం

ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంకావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 14: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎంపిపి గంట్యాడ శ్రీదేవి కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపిపి ఛాంబర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు అధ్యక్షతన టిడిపి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువచేసి అర్హులైవారందరికీ అందేలా చూడాలని అన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు కొత్తరేషన్ కార్డుదారులు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినందున అర్హులైన వారితో దరఖాస్తులు అందజేయాలని అన్నారు. అలాగే అర్హులైన వారితో పింఛన్ల కోసం దరఖాస్తులు ఎంపిడి ఒ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జనవరి-2 నుంచి జన్మభూమి కార్యక్రమం నిర్వహించనున్నందున అప్పటిలోగా దరఖాస్తులు పెట్టించాలని అన్నారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పాలని అన్నారు. కార్యకర్తలందరు సమిష్టిగా పనిచేస్తే విజయం తధ్యమని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి కనకల పోలినాయుడు, ఎ ఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, ఆత్మాకమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, ఎఎంసి డైరెక్టర్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కౌమార విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన

కొత్తవలస, డిసెంబర్ 14: కౌమారదశలో ఉన్న విద్యార్థినులకు ఆరోగ్యం, తీసుకోవలసిన ఆహారంపై కొత్తవలస పిహెచ్‌సి వైద్యురాలు ఎ.గార్గీదేవి అవగాహన కల్పించారు. దెందేరు, జడ్పీటి హైస్కూల్‌లో పాఠశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కౌమారదశలో వచ్చే మార్పులు, ఆరోగ్య రక్షణపై పలుసూచనలు చేశారు. ఇదిగే వయస్సులో పౌష్టికాహారం తీసుకోవాలని, ఇప్పుడు తీసుకున్న ఆహారమే భవిష్యత్తు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. కౌమారదశలో శరీరంతోపాటు ఆలోచనలు, స్వరం, ఆవభావాలలో మార్పు చెందుతాయని ఆమె అన్నారు. విద్యార్థి దశ నుండి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని 19 ఏళ్ల లోపు వయస్సుగల వారు ఇప్పటినుండే మంచి ఆలోచనలు కలిగి ఉండాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతర పెద్దలు సూచించిన మార్గాలను ఆచరించాలని విద్యార్థినులకు తెలిపారు. రక్తహీనత ఉన్నవారికి ఐరెన్, పోలిక్ యాసిడ్‌తో కూడిన మాత్రలు పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం ఆసుపత్రి కేంద్రంలో ఆరోగ్య తనిఖీలు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.