విజయనగరం

అంతా మొక్కుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 14: అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్లు ఇష్టానురాజ్యం వెరసి రైతుల పాలిట శాపం. ఇది సాగునీటి కాలువల పరిస్థితి. మండలంలో ప్రధాన సాగునీటి వనరులైన 13వంవుల కాలువ, బి.వి.్ఛనల్‌కు చంపావతి నది నుండి సాగునీరు మళ్లించే రక్షణ గోడల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం నిర్మాణ పనులు చేపట్టడంతో నిర్మాణాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తికాకముందే బీటలు వారడంతో సాగునీరు అరకొరగా వెళుతున్నది. ఏడాదిలో ఖరీఫ్, రబీసీజన్‌లో పుష్కలంగా రెండు పంటలకు సాగునీటి కాలువల ద్వారా సుమారు 15 గ్రామాలకు పదివేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. తొలుత 13వంపుల కాలువకు రక్షణగోడ నిర్మాణ పురంలో ఎం.వెంకటాపురం గ్రామం వద్ద తొమ్మిది లక్షలతో పనులు చేపట్టారు. ఏడాది కాకముందే రక్షణగోడ విరిగిపోయి సాగునీరు కాలువల్లోని నీరు తిరిగి చంపావతినదిలోకి వెళుతున్నది. ఈ రక్షణగోడ కూడా పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడం, నిధుల కొరత వలన పనులు సగంలోనే నిలిచిపోయాయి. గత ఏడాది మరోకోటి 30లక్షల రూపాయల నిధులు విడుదల కావడంతో ఆ మేరకు పనులు చేశారు. అయితే రక్షణగోడను బస్సు వంతెన వరకు పనులు చేపట్టకపోవడంతో చంపావతినదిలోని నీరు పూర్తిస్థాయిలో కాలువలోకి వెళ్లే పరిస్థితి ప్రస్తుతం లేదు.దీంతో అరకొరగానే సాగునీరు కాలువద్వారా వెళ్లే పరిస్థితి ఉంది. బివి ఛానల్ కాలువ రక్షణగోడ నిర్మాణ పనులను పట్రువాడ గ్రామం వద్ద రెండేళ్ల కిందట పనులు చేపట్టారు. ఈ పనులు కూడా తూతూ మంత్రంగా చేపట్టడంతో రక్షణ గోడ నిర్మాణ పనులు కూడా పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం, నిధులు కొరత కారణంగా సగంలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో రక్షణగోడకు ఎక్కడికక్కడ బీటలు ఏర్పడడంతోపాటు రక్షణగోడ లోపల కూడా పెచ్చులు ఊడిపోయాయి. రక్షణగోడ నిర్మాణపనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి ఏడాదికి ఆరు లక్షల వంతున మూడేళ్లపాటు 18 లక్షల నిధులు విడుదల చేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని చెప్పి ఏడాదిన్నర కిందటే ఎమ్మెల్యే నాయుడు శంఖుస్థాపన చేశారు. నేటికీ ఒక్క అడుగు అక్కడ ముందుకు పడలేదు. రబీసీజన్‌లో కూడా ఈ కాలువ ద్వారా గతంలో నీరు పొలాలకు అందేది. చంపావతినదిలో ఇష్టానురాజ్యంగా ఇసుకతవ్వకాలు చేపట్టడంతో నదిలోతుగా అవడం వలన సాగునీరు కాలువ ద్వారా సాగునీరు ప్రస్తుతం వెళ్లడంలేదు. నీటిని మళ్ళించేందుకు రక్షణగోడను ప్రభుత్వం అదికారులు చొరవ తీసుకోవడంలో జాప్యం జరగడంతో ప్రతి ఏడాది రైతులే ఇసుక బస్తాలు అడ్డుకట్టవేసి కొంచెం నీటిని మళ్లించుకునే పరిస్థితి నెలకొంది.

ఆర్టీసీ సిబ్బంది ఔధార్యం

గజపతినగరం, డిసెంబర్ 14: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బ్యాగులో ఉంచిన నగదును మరచిపోయి ఆర్టీసీ అధికారులను ఆశ్రయించగా వారి చొరవ, ఔధార్యంతో పోగొట్టుకున్న బాగుతో సహా 20వేల రూపాయల నగదు బాధితుడుకి అప్పజెప్పిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన మరిశెర్ల అప్పారావు విశాఖలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న స్వ గ్రామం వెళ్లేందుకు విశాఖ నుండి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు. విజయనగరం డిపో వద్ద బస్సులో బ్యాగును మరచిపోయి దిగిపోయాడు. దీంతో బాధితుడు బ్యాగు మరచిపోయిన విషయాన్ని గుర్తించి బస్సు ఆగి ఉన్న చోటకు వచ్చే సరికి బస్సు పార్వతీపురం బయలుదేరి వెళ్లిపోయింది. దీంతో బాధితుడు లబోదిబో మనగా వింధ్యవాసి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ టికెట్‌తో వెళ్లి ఈ సమాచారాన్ని స్టేషన్ మేనేజర్ వెంకటరావుకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ మేనేజర్ గజపతినగరం ట్రాఫిక్ గైడ్‌గా పనిచేస్తున్న తమరాపురమేష్, ఆరికతోట జగదీష్‌లకు ఎపి.35 ఎక్స్ 5888 బస్సులో బ్యాగు మరచిపోయిన విషయాన్ని చెప్పడంతో వారు బస్సును ఆపి బ్యాగుతోపాటు బ్యాగులో ఉన్న 20వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని ఎస్సై వరప్రసాద్‌కు అందజేశారు. బాధితుడు స్టేషన్‌కు చేరుకుని ఆనగదును ఎస్సై చేతులుమీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందిని, యువకుడుని అభినందించారు.

రక్షణాత్మక చర్యలతో ప్రమాదాల నివారణ సాధ్యం
* విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్

గజపతినగరం, డిసెంబర్ 14: ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు జరగకుండా రక్షణాత్మక చర్యలు తీసుకోవడం వలన ప్రమాదాలను నివారించడం సాధ్యపడుతుందని విజయనగరం డిపో మేనేజర్ ఎస్.వి. ఎస్.వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్సు స్టేషన్ వద్ద ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పర్యటించి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 128 డిపోలలో అక్టోబర్-24 నుండి ఈనెల 30వ తేదీ వరకు డ్రైవర్లకు ప్రమాదాల నివారణ కోసం శిక్షణలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో 325 మంది శాశ్వత డ్రైవర్లు, 259మంది అద్దెబస్సుల డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దశలవారీగా డ్రైవర్లకు శిక్షణలు ఇస్తున్నామని, ఇంత వరకు 14బ్యాచ్‌లకు శిక్షణలు ఇచ్చామని అన్నారు. జి. పి. ఎస్ విధానంతో బస్సులను అనుసంధానం చేయడం ద్వారా ఏ బస్సు ఎక్కడ ఉంది, ఎంత వేగంలో నడుస్తున్నది, గమ్యస్థానాన్ని ఎంతసమయంలో చేరుకోవచ్చో బస్సు నెంబరు కొట్టడం ద్వారా తెలుసుకోవచ్చు అని అన్నారు. ఒక్కొక్క డ్రైవరు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని, శిక్షణలో భాగంగా తరచు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లు, ప్రమాదాలు ఏ సమయాలలో జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలు వివరించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆధునిక బస్సులు ఏవిధంగా నడపాలి, సాంకేతిక అంశాలపై అవగాహన, హ్యాండ్ బ్రేక్, ఆరుగేర్లు విధానం, ఎబి ఎస్ విధానంపై డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవింగ్ శిక్షకుడు బి.వి. ఆర్. ఎం.రాజు తదితరులు పాల్గొన్నారు.