విజయనగరం

26న ‘విజయనగరం పోలీస్ వెబ్‌సైట్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 20: రాష్ట్రంలో తొలిసారిగా 54 సిటిజన్ సర్వీసు సేవలతో కూడిన విజయనగరం పోలీసు వెబ్‌సైట్ ’విజయనగరం పోలీసు.ఇన్’ వెబ్‌సైట్‌ను ఈ నెల 26న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జి.పాలరాజు తెలిపారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఎవరైనా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే పోలీసు సేవలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా పౌరులకు అవసరమైన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునేవీలుందన్నారు. ఫిర్యాదు చేస్తే అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. అలాగే అద్దెకు గృహం ఇచ్చేటపుడు అందులో దిగే వారి కోసం విచారణ చేయమని కోరితే దానిని కూడా పోలీసులు విచారించి నివేదిక అందజేస్తారన్నారు. అలాగే రహదారిపై ప్రయాణిస్తున్నపుడు ఏదేని ప్రమాదం జరిగితే అక్కడకు దగ్గర్లో ఏ పోలీసు స్టేషన్ ఉంది? ఏ ఆసుపత్రి ఉంది? బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? బ్లడ్ డోనర్ల సమాచారం వాటి ఫోన్ నంబర్లు వెంటనే తెలుసుకోవచ్చన్నారు. కోర్టు, జైలు, పాస్‌పోర్టు డేటా, ఆర్‌టిఐ డేటా కూడా డ్యాష్ బోర్డు ద్వారా పోలీసులు తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. అలాగే ఏదేని కార్యక్రమం చేసుకునేటపుడు వారికి పోలీసు బందోబస్తు కావాలన్నా, బ్యాండ్ పార్టీ కావాలన్నా వెబ్‌సైట్ నుంచే వారు సంప్రదించుకునే అవకాశం ఉందన్నారు. ఇక వాహనాలకు సంబంధించిన సమాచారం కూడా పొందుపరుస్తామన్నారు. ఒకవేళ ఏదేని సెకండ్ హేండ్ వాహనం కొనుగోలు చేసేటపుడు అది గతంలో దొంగతనానికి గురైనదా? కాదా? అనేది కూడా తెలుసుకునే వీలుందన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మున్సిపల్ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్ పథకానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఏదేని గృహ యజమానులు ఇంటికి తాళం వేసి ఊరువెళ్తే ఆ సమాచారాన్ని ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో పొందుపరచిన వారి ఇంటికి సిసి కెమెరాలు అమర్చి వాటి ద్వారా పోలీసు నిఘా ఉంచుతున్నామన్నారు. అంతేగాకుండా ఆ నిఘాను ఎప్పటికపుడు ఆ యజమాని తన సెల్‌ఫోన్‌లో కూడా చూసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ విధంగా జిల్లాలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు.