విజయనగరం

ఇంధన పొదుపు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 20: కాలుష్యరహిత వాహనాల వల్ల ఇంధనం పొదుపుతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆర్టీసీ విజయనగరం డిపో మేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్ కోరారు. ఇంధన పొదుపువారోత్సవాల్లో భాగంగా శనివారం ఇక్కడ డిపోవద్ద జరిగిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంధనం పొదుపుపాటించడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని ఆదా చేయవచ్చునని తెలిపారు. విజయనగరం డిపోలో సగటున ఏడాదికి కోటి రూపాయల మేరకు డీజిల్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కిలోమీటరు దూరానికి 12 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. సిబ్బంతి జీతభత్యాల తర్వాత అత్యధికంగా డీజిల్ కొనుగోలుకు ఖర్చు అవుతుందని, అందువల్ల డిపోలో పనిచేస్తున్న 164 మంది డ్రైవర్లు తప్పనిసరిగా ఇంధనం పొదుపుచేయాలన్నారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదాతోపాటు దేశ సంపదకు పెంపొందించుకోవచ్చునని, ఈ దిశగా డ్రైవర్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెకానిల్ ఇన్‌ఛార్జి ఎంకెఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
శంబర జాతరకు ముమ్మర ఏర్పాట్లు
మక్కువ, జనవరి 20: శంబర శ్రీపోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించిన ఏర్పాట్లును ముమ్మరంగా చేపడుతున్నారు. మామిడిపల్లి నుంచి శంబరకు 8కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారిని కోటి 65 రూపాయలతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తిగా రోడ్డును తవ్వి అందులో మెటల్ వేసి రోలింగ్ చేస్తు రోడ్డుకిరువైపులా మట్టిపోసి ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. అలాగే శంబర నుంచి మక్కువకు వెళ్లే రహదారిలో సుమారు కిలోమీటరు రహదారిని 65 లక్షల రూపాయల ఐటీడీఏ నిదులతో మరమ్మతులు చేయించి బాగుచేయిస్తున్నారు. బీటీ రోడ్డును వేయకపోవడంతో ఈ ఏడాది కూడా భక్తులకు దుమ్ము, ధూళితో ఇబ్బందులు తప్పడం లేదు. జాతరకు వచ్చే భక్తులకు అమ్మవారి ప్రసాదమైన లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి ప్రకాష్ తెలిపారు. ఈమేరకు 35వేల లడ్డూ, తగిన పులిహోర ప్రసాదాన్ని తయారుచేయిస్తున్నామని తెలిపారు. 80 గ్రాముల లడ్డూ ప్రసాదం 15 రూపాయలు, 100గ్రాముల పులిహోర ప్యాకెట్‌ను 10 రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు. జాతరకు సంబంధించిన బారికేట్లు, క్యూలైన్లు, టెంట్లు, తదితర ఏర్పాట్లును చేస్తున్నామన్నారు. జాతరకు వచ్చ్భేక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, చిన్నపిల్లలకు పాలు, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.