విజయనగరం

చేతబడి అనుమానంతో గిరిజనుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, జనవరి 20: చేతబడి అనుమానంతో గిరిజనుడిని హత్యచేసిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, గ్రామస్థులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పద్మాపురం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కొర్రా మూగయ్య(48)ను అదే గ్రామానికి చెందిన కొర్రా చిన్నారావు, కె కొత్తయ్యలు శుక్రవారం సాయంత్రం హత్య చేశారు. మూగయ్య గ్రామ సమీపాన గల చండ్రమానువలసలో ఓ శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో చిన్నారావు, కొత్తయ్యలు బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. హత్యచేసిన వారిలో ఒకరి భార్యకు మూగయ్య చేతబడి చేసి చంపాడన్న అనుమానంతో హత్య చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సాలూరు సీఐ సంజీవిరావు, పాచిపెంట ఎస్‌ఐ సన్యాసినాయుడులు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దల సమక్షంలో శవపంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సిహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి 5గురు పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని సర్పంచ్ పాచిపెంట వీరంనాయుడు పరామర్శించారు.
టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
విజయనగరం (్ఫర్టు), జనవరి 20: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు రాష్ట్ర మావన వనరుల అభివృద్ధి శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ విలేఖరులతో సింహాచలం మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది టీచర్లకు సంబంధించిన ఏకీకృత సర్వీస్‌రూల్స్ అమలుకు న్యాయపరంగా ఉన్న ఆటంకాలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పై హైకోర్టులో ఉన్న స్టేటస్ కో-ను తొలగించేందుకు న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల సంఖ్య 72,73,74లపై ఉమ్మడి హైకోర్టు స్టేటస్‌కో విధించడం వల్ల సర్వీస్‌రూల్స్ సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయిందని తెలిపారు. ఫలితంగా విద్యారంగం అభివృద్ధి కోసం విద్యాశాఖా మంత్రి శ్రీనివాసరావు చేసిన ప్రయత్నానికి ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఉమ్మడి సర్వీస్‌రూల్స్ ఫలాలు అందకుండానే వందలాందిమంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారని సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.