విజయనగరం

వసతులున్నా.. విశాఖ నుంచే రాకపోకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 20: ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కేంద్రాల్లోనే నివాసం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ నేటికి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఇతర ప్రాంతాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం పకడ్బందీగా హాజరుపట్టీని నిర్వహించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ అన్ని శాఖలకు బయోమెట్రిక్ విధానం లేకపోవడంతో కొందరు ఉద్యోగులు సొంత పనులలో నిమగ్నమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 రకాల ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీరిలో పలువురు ఉద్యోగులు, అధికారులు విధులకు రాకుండానే వచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బయోమెట్రిక్ విధానంలో కొన్ని శాఖల అధికారులకు వారి హోదాను అనుసరించి కొన్ని సడలింపులు ఇవ్వడంతో దానిని ఆసరాగా తీసుకొని డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో పనిచేయాల్సిన ఉన్నతాధికారుల్లో మూడోవంతు మంది విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కిందిస్థాయి సిబ్బంది కూడా విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీటిలో ఆర్ అండ్ బి, వ్యవసాయశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటిసరఫరా, ఉద్యానశాఖ, సాగునీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, విద్యా శాఖ ఇలా వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్న ప్రాంతానికి, నివాసం ఉండే చోటుకు కనీసం 50-100 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నారు. వారు పనిచేసే కార్యాలయాలకు పలువురు అధికారులు, ఉద్యోగులు, అతిధుల్లా విధులకు వచ్చి పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 రకాల ప్రభుత్వ శాఖలు ఉండగా వాటిలో కొన్ని శాఖలకు బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడంతో రికార్డుల్లో హాజరు వేసుకొని అతిధుల్లా వచ్చి వెళ్లిపోతున్నారు. జిల్లా కలెక్టర్ కూడా కొన్ని శాఖలతో సమీక్షలు జరపడం వల్ల మిగిలిన శాఖల సిబ్బంది ఏం చేస్తున్నారనే విషయమై దృష్టిసారించకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆటగా మారుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వీరంతా ఉదయం విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చి సాయంత్రం 3 గంటలకు తిరిగి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వెనక్కి వెళ్లిపోవడం అందరికీ తెలిసిందే.
మందుల దుకాణంలో అగ్ని ప్రమాదం
గజపతినగరం, జనవరి 20: గజపతినగరం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వాసవి మందుల దుకాణంలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో షాపులోగల మందులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 1గంట ప్రాంతంలో షాపు నుండి దట్టమైన పొగలు రావడంతో రాత్రిపూట గస్తీ తిరుగుతున్న పోలీసులు సంఘటనను గమనించి షాపులోని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. షాపు షట్టర్లు పూర్తిగా వేసి ఉంచడంతోపాటు దట్టంగా పొగలు రావడంతో మంటలను అదుపుచేయడం కష్టతరమైంది. షాపుమీదనే నివాసం ఉంటున్న ఎం.రాముకుటుంబం కేకలు వేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇద్దరు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన విషయాన్ని షాపు యజమాని వడ్డాది మహేశ్వరరావుకు తెలియజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో షెట్టర్లు తెరచి విజయనగరం నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గజపతినగరం సబ్ ఇన్ స్పెక్టర్ వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు 20లక్షల రూపాయలు విలువైన మందులు దగ్థమయ్యాయని అంచనా. గజపతినగరం అగ్నిమాపక వాహనం మరమ్మతులకు గురికావడంతో ఇటీవల గూడ్స్ రైలులో మంటలు వ్యాపించడంతో బాడంగి నుంచి వచ్చిన అగ్నిమాపక శకటం మంటలను అదుపుచేసింది.