విజయనగరం

ఉత్తుత్తి కొనుగోలు కేంద్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జనవరి 20: స్థానిక ఏఎంసీ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం రెండు నెలలైనా క్వింటా పత్తిని కూడా రైతులు విక్రయించలేదు. 2 నెలల క్రితం ఏఎంసీ గొడౌన్‌లో ఈ కేంద్రాన్ని ఎమ్మెల్సీ జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్‌లు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్వింటా పత్తిని కూడా అధికారులు కొనుగోలు చేయలేదు. అమ్మకానికి తెచ్చిన పత్తిని కూడా సీసీఐ అధికారి నాణ్యత లేదన్న షాక్‌తో తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులెవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి రాలేదు. దళారుల భారిన పడకుండా రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. సీసీఐ నిర్ధేశించిన నిబంధనలు కూడా రైతుల పాలిటశాపంగా మారింది. గతంలో పత్తికొనుగోలు వ్యవహారంలో జరిగిన అక్రమాలు కారణంగా కొంతమంది ఉద్యోగులపై వేటుపడింది. ఇక్కడ పనిచేసిన ఏ ఎంసీ కార్యదర్శిగా సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పత్తికొనుగోలు చేసిన అక్రమాల నేపథ్యంలో సీసీఐ కఠినమైన నిబంధనలను జారీచేసింది. ఈ నిబంధనలు రైతులకు ఏ మాత్రం మేలుచేసేవిధంగా కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న ఏకైక పత్తి కొనుగోలు కేంద్రంలో ఒక క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయలేదు. అధికారుల చిత్తశుద్ధిని చంకించాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యాపారులు యదేచ్ఛగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తూనికల్లో మోసం చేసిన రైతులు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. క్వింటా పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన ధర 4,320 రూపాయలు మాత్రమే. 8శాతం తేమ ఉంటే ఈ ధరకు కొనుగోలు చేస్తారు. తేమశాతం పెరిగిన కొద్ది ధర తగ్గిపోతుంది. 12శాతానికి మించి తేమ ఉన్నట్లయితే పత్తిని కొనుగోలు చేయరాదని సీసీ ఐ నిర్ధేశించింది. పత్తిపంటను ఇ క్రాప్ బుకింగ్ విధిగా చేసుకోవాలని నిబంధన కూడా ప్రధాన అడ్డంకిగా మారింది. ఇ క్రాఫ్ బుకింగ్‌పై చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతోపాటు వ్యవసాయ అధికారులు కూడా అవగాహన కల్పించకపోవడంతో వారికి శాపంగా మారింది. రామభద్రపురం, పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల్లో సుమారు 20వేల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం ఉత్సవ విగ్రహంలా నిలవడంతో ప్రైవేటు వ్యాపారులు యదేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం వద్ద ఒక అధికారిని కూడా నియమించింది. రైతులు రాకపోవడంతో ఈ కేంద్రం మూతపడింది. పత్తికోసం ఏర్పాటు చేసిన గొడౌన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో సీసీఐ కుమ్మక్కు?
నిబంధనల నెపంతో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకపోవడానికి గల ప్రధాన కారణంగా రామభద్రపురంలో ఉన్న పత్తి జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కవ్వడమేనని తెలుస్తోంది. బూసాయవలస వద్ద గత కొద్దిసంవత్సరాలుగా ఈ మిల్లు నడుస్తోంది. ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తిని ఈ మిల్లుకే సరఫరా చేస్తుంటారు. 4మండలాల్లో ఉత్పత్తి అయిన పత్తిని ఈ మిల్లుకు సరఫరా చేయాలన్న ఉద్ధేశ్యంతో ఇక్కడ కొనుగోలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్టవ్య్రాప్తంగా కొనుగోలు చేస్తున్న ఇక్కడ మాత్రం నాణ్యత పేరుతో అధికారులు నిరాకరించి ప్రైవేటు వ్యాపారులవైపు మొగ్గుచూపేలా చేస్తున్నారు.