విజయనగరం

మార్చి నాటికి కనె్వర్జెన్సీ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: వివిధ శాఖలలో ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కనె్వర్జెన్సీ పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి రోడ్ల లక్ష్యం 330 కిమీ కాగా, 400 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తయినందున ఉపాధి లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులను వెంటనే చేపట్టాలన్నారు. ముఖ్యంగా సిసి రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలు, గృహాలకు ఇటుకల తయారీలో ఎలాంటి చర్చకు తావివ్వరాదన్నారు. లేబర్ బడ్జెట్‌ను రూ.3.30కోట్లు చేయాలన్నారు. తద్వారా వేతనాలు రూ.165 నుంచి రూ.180 పెరిగేలా చూడాలన్నారు. ఫారంపాండ్స్ లక్ష్యాన్ని 18వేలకు తగ్గించాలన్నారు. ఫిష్‌పాండ్స్ నిర్మాణంలో గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి పనిని జియోట్యాగ్ చేసి వేతనం లబ్ధిదారుల ఖాతాకు జమ అయ్యేలా చూడాలన్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం ఆశించిన రీతిలో జరుగుతుందన్నారు. కాగా, వాటి వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గణతంత్ర దినోత్సవం రోజున అవార్డుల ప్రధానానికి ప్రతిపాదించాలన్నారు. కాగా, జన్మభూమి, సంక్రాంతి వేడుకలలో అవార్డులు పొందిన వారిని మినహాయించాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పివో లక్ష్మిష, జెసి నాగేశ్వరరావు, సిఇఒ వేంకటేశ్వరరావు, ఆర్డీవో సుదర్శనదొర, ప్రాజెక్టు డైరెక్టర్లు రాజగోపాల్, సుబ్బారావు, రాబర్ట్స్, జెడి సింహాచలం, జెడి లీలావతి, ఉద్యాన శాఖ డిడి పిఎన్‌వి లక్ష్మినారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులు పాల్గొన్నారు.