విజయనగరం

పింఛన్లలో కఠిన నిబంధనలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: జిల్లాలో అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని శాసనసభ హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పార్టీలకతీతంగా అందజేయాలన్నారు. కాగా, వికలాంగుల పింఛన్ల విషయంలో కఠిన నిబంధనలు పెట్టి అర్హులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాల కంటే పది రెట్లు అధికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 33 హామీలు ఇవ్వగా వాటిలో 30 హామీలు పరిష్కారమయ్యాయన్నారు. మిగిలిన వాటిని రాష్ట్ర స్థాయిలో పరిష్కరిస్తామని వివరించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వల్ల ఎలాంటి మరణాలు లేకుండా సిబ్బంది బాగా పనిచేశారన్నారు. అధికారులు మంచి గుర్తింపు తెచ్చుకోడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాలన్నారు. చర్చిలు, ఆలయాలు, పాఠశాలలు, హైవేకు 500 మీటర్ల దూరం వరకు బెల్టుషాపులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో అధికారుల పనితీరు బాగుందని కితాబునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బుద్ద వెంకటేశ్వరరావు, డిఆర్వో రాజ్‌కుమార్, ఆర్డీవోలు జెవి మురళీ, సుదర్శనదొర, డిసిఎఫ్‌ఒలు వేణుగోపాల్, లక్ష్మణ్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ, డిఇఒ నాగమణి, ఐటిడిఎ పివో లక్ష్మిశ తదితరులు పాల్గొన్నారు.