విజయనగరం

పథకాల పంపిణీలో పక్షపాత వైఖరి విడనాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 22: ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో పార్టీల ప్రమేయం మంచిదికాదని, కేవలం పేదలను ఆదుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు అధికారులపై ధ్వజమెత్తారు. కొద్దిసేపు వాగ్వివాదాలు జరిగాయి. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధుపాడ ఎంపిటిసి పైడిపునాయుడు పాతశ్రీరంగరాజపురం సర్పంచ్ ఏనుగుల శ్రీను తదితరులంతా గృహ నిర్మాణశాఖ, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులను నిలదీశారు. రైతు రథం పేరుతో బినామీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారని, ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ట్రాక్టర్ కూడా మంజూరు చేయలేదని వాళ్ల మనుషులుకాదా అని ఎ ఒ సంగీతను నిలదీశారు. అదే విధంగా పలు గ్రామాలకు చెందిన చెరువులను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకోరా అంటూ పౌరసరఫరాల డిటి మూర్తిని నిలదీశారు. తక్షణ దర్యాప్తు జరిపించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపిపి గంట్యాడ శ్రీదేవి సూచించడంతో గొడవ సద్దుమణిగింది. అదే విధంగా తన గ్రామంలో ధనికులకు పక్కా ఇళ్లు మంజూరు చేయడం మంచిపనినే అని ప్రశ్నించారు. పి. ఎస్. ఆర్. పురం సర్పంచ్ ఏనుగుల శ్రీను జోక్యం చేసుకుని చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, కొత్తపనులకు అనుమతులు ఇవ్వకపోవడం వలన అభివృద్ధి కుంటుపడుతుందని అధికారులను నిలదీశారు. రోడ్డు పనులకు సంబంధించి 20శాతం ధరావత్తులు రెండేళ్లు అయినా నేటికీ చెల్లించకపోవడం దారుణమంటూ పంచాయతీ జెఇ మధును ఎంపిటిసి సభ్యురాలు నగర ప్రసన్నకుమారి నిలదీయడంతో ఎంపిపి జోక్యం చేసుకోవడంతో 15రోజుల్లో పరిష్కరిస్తామని సభకు హామీ ఇచ్చారు. ఉద్యాన వన శాఖకు సంబంధించి ఏఏ పథకాలు ఉన్నాయి. రైతులకు ఇచ్చే రాయితీలు గురించి ఒక్క రైతుకు కూడా గ్రామాలలో ప్రచారం చేశారా అంటూ వైస్ ఎంపిపి కనకల పోలినాయుడు సంబంధిత అధికారిని నిలదీయడంతో ఆయన సభకు వివరణ ఇస్తూ ఇకపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపిడి ఒ ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తల్లే ప్రత్యక్ష దైవం
* ఎంపిపి శ్రీదేవి
గజపతినగరం, జనవరి 22: తల్లే ప్రత్యక్ష దైవమని ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అన్నారు. సోమవారం అమ్మకువందనం కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపిపి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృమూర్తి ప్రథమ గురువు అని అలాంటి తల్లిని పూజించడం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో ఒక భాగమని అన్నారు. వసంతపంచమిని రోజున ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి మాతృమూర్తిని గౌరవించడం ఆనందదాయమని అన్నారు. పిల్లల సంరక్షణలో ఎంతోజాగృత వహించేది తల్లేనని చెప్పారు. కనుమరుగవుతున్న మానవతా విలువలను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. అనంతరం విద్యార్థులు తమతమ తల్లులు పాదాలను కడిగి పాదాభివందనం సామూహికంగా చేశారు. ఈ మహత్తర కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. అలాగే పిల్లలను తల్లులు ఆశీర్వధించారు. అదే విధంగా గురజాడ పాఠశాలల్లో కరస్పాండెంట్ గండ్రేటి లక్ష్మణరావు పర్యవేక్షణలో, గజపతినగరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కె.వి.బి. ఆచార్యులు పర్యవేక్షణలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఇఒ విమలమ్మ, ఎంపిటిసిలు కర్రి శ్రీదేవి, నగర ప్రసన్నకుమారి, ప్రధానోపాధ్యాయులు మూర్తి, తదితరులు పాల్గొన్నారు.