విజయనగరం

అమ్మే ప్రత్యక్ష దైవం: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జనవరి 22: అమ్మే ప్రత్యక్ష దైవమని కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. సోమవారం రామతీర్థం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమ్మకు వందనం కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాతృమూర్తిని గౌరవించాలని అన్నారు. మాతృమూర్తి విశిష్టతను తెలియజేయడానికే ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించిందని అన్నారు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కొంతమంది అనాదాశ్రమాల్లో చేర్చుతున్నారని అన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి సువ్వాడ వనజాక్షి, డిఇఒ నాగమణి, తహశీల్దార్ కె.చిన్నారావు, ఎంపిడిఒ కె.రాజ్‌కుమార్, నాయకులు గేదెల రాజారావు, సర్పంచ్ పద్మలత తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులు దైవంతో సమానం
గుర్ల, జనవరి 22: తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని మండల విద్యాశాఖాధికారి భానూప్రకాష్ అన్నారు. సోమవారం శ్రీపంచమని పురస్కరించుకుని మండలంలోని అన్ని పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుర్ల పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి తహశీల్దార్ ఆదిలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు వెనె్న సన్యాసినాయుడు,జిల్లా టి ఎన్ టి ఎస్ కిరణ్‌కుమార్‌రాజు, ఎంఇఒ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఎంఇఒ మాట్లాడుతూ దిగజారుతున్న విలువలను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూసుకోవాలని అన్నారు. అలా చేస్తే విద్యాభివృద్ధిలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా గూడెం,గుర్ల, గుజ్జింగివలస, తెట్టంగి, పాలవలస, వల్లాపురం, నడుపూరు తదితర పాఠశాలల్లో తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులతో పాదాభివందనాలు ఆయాపాఠశాలల ఉపాధ్యాయులు చేయించారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలకు ఒకజాకెట్ ముక్కను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లులు పాల్గొన్నారు.

టెండర్లలో అవకతవకలు లేవు:రెస్కో పాలకవర్గం
చీపురుపల్లి, జనవరి 22: గ్రామీణ విద్యుత్ సరఫరా సహాకార సంఘం (రెస్కో)లో స్పాట్ బిల్లింగ్‌లకు పిలిచిన టెండర్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని సంస్థ పాలకవర్గం స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి, ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు, వైస్ ఛైర్మన్ సురేష్, పాకలవర్గం సభ్యులు గవిడి నాగరాజు, కెల్ల రామారావు, గరివిడి ఎంపిపి పైల సింహాచలం, గరివిడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పైల బలరాం తదితరులతో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టెండర్లులో ఎటువంటి అవకతవకలు జరగలేదని, తక్కువకు టెండరు వేసిన వారితో చర్చలు జరిపిన తర్వాత అదే ధరకు రెండవ టెండరు దారునకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆదాయపుపన్నుశాఖకు పన్ను ఎగవేసే దుస్థితి సంస్థకు లేదని సంస్థ లాభాలబాటలో ఉండబట్టే పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన పన్ను చెల్లించాల్సిన మొత్తంతో సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆదాయపుపన్నుశాఖాధికారులను కోరామని వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న పాలకవర్గం సమయంలో రైతులకు విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని గుర్తుచేస్తూనే ప్రస్తుతం ఆపరిస్థితి లేదని తెలిపారు.

సృష్టిలో మొదటి గురువు అమ్మే:జెడ్పీటీసి
చీపురుపల్లి, జనవరి 22: సృష్టిలో మొదటి గురువు అమ్మేనని జెడ్పీటీసి సభ్యుడు మీసాల వరహాలనాయుడు అన్నారు. అమ్మకువందనం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పుట్టిన ప్రతి ఒక్కరికీ అన్ని విషయాల్లో గురువుగా అమ్మే ముందుంటుందని తర్వాత స్థానంలో తండ్రి ఉంటారన్నారు. తల్లి ఆలనాపాలనా చూసుకుంటే తండ్రి క్రమశిక్షణ, బాధ్యతతో పిల్లలను పెంచుతారని వివరించారు. తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న విలువలకు పాఠశాలల్లో గురువులు నేర్పే పాఠాలుతో పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులను గౌరవించడం అలవాటు చేయడం ద్వారా పెద్దలు గౌరవించాలనే విషయాన్ని తెలియజేసినట్టవుతుందన్నారు. తద్వారా మహిళలు, వృద్దుల పట్ల గౌరవ మర్యాదులు పెరుగుతాయన్నారు. అంతకుముందు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతిదేవికి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం పిల్లల తల్లులను పాఠశాలలకు పిలిపించి వారి పిల్లలతోనే తల్లులకు పాదాభివందనం చేయించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, ఎంపిడీవో రామకృష్ణ, మండల విద్యాశాఖాధికారి జమ్ము మహాలక్ష్మునాయుడు, విద్యాకమిటీ ఛైర్మన్ ఎల్లంనాయుడు, వార్డు సభ్యులుపాఠశాలల ప్రధానోపాధ్యాయులు వి అప్పారావు, డి గౌరీదేవి, మురళీధర్, మొహనరావు పాల్గొన్నారు.