విజయనగరం

పరిశ్రమల కేంద్రంగా కొత్తవలసను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, జనవరి 23: జిల్లాలోని కొత్తవలస మండలాన్ని పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధిచేసేందుకు జిల్లా యంత్రాంగం శాయశక్తుల కృషి చేస్తున్నదని ఆర్డీఒ వెంకట మురళీ తెలిపారు. మంగళవారం కొత్తవలస తహశీల్దార్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. కొత్తవలసలో ఇప్పటికి గిరిజన యూనివర్సిటీ, పతంజలి సంస్థ, ఎపి ఐఐటి ఇండ్రస్టీల్ పార్కుతో పలు ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయని ఆయన తెలిపారు. చినరావుపల్లిలో పతంజలి సంస్థకు ఇప్పటికే భూములు అప్పగించామని, మరికొంతమంది రైతుల ద్వారా మరికొంత భూమిని సేకరిస్తున్నామని ఆయన వివరించారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణంలో ఐటి డి ఎ నుండి నిధులు కేటాయించామని, గిరిజనులకు కావాల్సిన భూమిని ఈ నిధులతో జంగిల్ క్లియరెన్స్ చేసి అప్పగిస్తామని ఆయన చెప్పారు. బలిఘట్టాంలోని ఎపి ఐ ఐటి ఇండ్రస్టీల్ పార్కుకు ఇప్పటికే 30 ఎకరాలు ఇచ్చామని మరో 30 ఎకరాలు రైతుల నుండి సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖపట్టణానికి దగ్గర ఉండడం వలన పలు ప్రైవేటు కంపెనీలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ప్రభుత్వానికి నివేదికలు అందజేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ గణిత పోటీలలో
సత్యా కానస్పెట్ విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల, జనవరి 23: సైన్స్ ఒలింప్‌యార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపియార్డు పోటీ పరీక్షలలో జరజాపుపేట సత్యాకానస్పెట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ విజయశ్రీ తెలిపారు. మంగవారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఈ పాఠశాల నుంచి 35మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 33మంది జోనల్ స్థాయి పరీక్షకు అర్హత సాధించారని వెల్లడించారు. బి.జగన్మోహన్, చలం, ప్రణవ్, హస్మిత, వాసవి, హషిరిత, హాసిని, తేజశ్వని, ధనలక్ష్మి, ప్రవేణి, జోత్స్న, చరణ్‌తేజ, దీక్షిత్, భార్గవి, నిహారిక, చాందిని, మానస ఈపరీక్షలలో ప్రతిభ కనబరచారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులు ఫిబ్రవరి 12 విజయనగరంలో నిర్వహించనున్న పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అర్హత సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ కె.రాంబాబు, ఎఒ సంతోష్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

మార్చినాటికి లక్ష్యాన్ని చేరుకోవాలి

లక్కవరపుకోట, జనవరి 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐ ఎస్ ఎల్ నిర్మాణాల లక్ష్యాన్ని మార్చినాటికి చేరుకోవాలని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. మంగళవారం ఎల్.కోట ఎంపిడిఒ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 26నాటికి నియోజకవర్గంలో 26 పంచాయతీలను ఓడిఎఫ్‌గా ప్రకటిస్తామని, మార్చి 30నాటికి నియోజకవర్గం మొత్తం ఓడి ఎఫ్‌గా ప్రటకించబడాలని సంబంధిత అధికారులు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ఎల్.కోట మండలంలో వివిధ పంచాయతీలు ఓడిఎఫ్‌గా ప్రకటించబడగా త్వరలో ఆరు పంచాయతీలు జాబితాలో చేరతాయిన ఆమె అన్నారు. మిగతా పంచాయతీలు అన్నీ మార్చి నాటికి శతశాతం ఓడిఎఫ్‌గా ప్రకటించబడాలని అధికారులను ఆదేశించారు.