విజయనగరం

కొత్త నియోజకవర్గాలకు గ్రీన్ సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 23: విభజన చట్టంలోని హామీల మేరకు శాసనసభ నియోజకవర్గాల పెంపుదలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో 50 శాసనసభ స్థానాలు పెరగనుండగా, జిల్లాలో కొత్తగా రెండు శాసనసభ స్థానాలు ఆవిర్భవించనున్నాయి. వాటిలో విజయనగరం-2, తెర్లాం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అన్ని నిబంధనలు సరిపోవడంతో ఈ రెండు కచ్చితంగా ఏర్పాటు కానున్నాయి.
తెర్లాం నియోజకవర్గం గతంలో ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దయ్యింది. దీంతో అక్కడ ఓటర్లు బొబ్బిలి నియోజకవర్గంలో చేరారు. ప్రస్తుతం జిల్లాలో విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్ కోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో టిడిపి ఏడు స్థానాలు, వైకాపా నేతలు రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో రెండు నియోజకవర్గాలు ఏర్పాటు కానుండటంతో రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని విజయనగరం పట్టణంలో 3.5 లక్షల జనాభా, విజయనగరం రూరల్‌లో మరో లక్ష జనాభా ఉంది. మరోపక్క శాసనసభా స్థానానికి పోటీచేసే ఆశావహుల సంఖ్య కూడా ప్రతి ఏటా అధికంగా ఉండటంతో ఎవరికి టిక్కెట్ ఖరారు చేయాలో ఆఖరి నిమిషం వరకు అధిష్టానం తేల్చుకోలేని పరిస్థితి ఉండేది. తాజాగా మరో రెండు నియోజకవర్గాలు చేరనుండటంతొ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీలు, మున్సిపాలిటీలు
బడ్జెట్లపై అవగాహన పెంచుకోవాలి

విజయనగరం (్ఫర్టు), జనవరి 23: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల బడ్జెట్లపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని జాతీయ దళిత మానవ హక్కుల ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ వి.నందగోపాల్ కోరారు. తద్వారా ప్రతీ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకుని స్వపరిపాలన దిశగా పంచాయతీలు తయారు కావాలన్నారు. పట్టణంలో యూత్ హాస్టల్‌లో ఎస్సీ,ఎస్టీ ప్రజాప్రతినిధులకు, బడ్జెట్స్-పంచాయతీల పాత్రపై రెండురోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నందగోపాల్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామీణ అభివృద్ధి జరగాలని 1959 సంవత్సరం బలవంతరాయ్ కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు. ఆ సిఫార్సుల ప్రకారం పంచాయతీరాజ్ సంస్ధలు ఏర్పడ్డాయని తెలిపారు. స్ధానిక సంస్థల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, సామాజిక తనిఖీలకు అవకాశం కల్పించాలన్నారు.
సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీడైరెక్టర్ సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాల కోసం అవహన కలిగి ఉండాలన్నారు. మూడంచెల పంచాయతీరాజ్ ప్రభుత్వాలు అనే అంశంపై జిల్లా పంచాయతీరాజ్ రిసోర్స్‌పర్సన్ బి.పట్నాయక్, జెండర్ బడ్జెట్ ఆంశంపై సుప్రియ, పంచాయతీరాజ్ ప్రతినిధుల పాత్రలు-బాధ్యతలు అనే అంశంపై రోజెస్ సంస్థ డైరెక్టర్ నాగమణి శిక్షణ ఇచ్చారు. దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ,ఎస్టీసబ్ ప్లాన్ సభ్యుడు రాము తదితరులు పాల్గొన్నారు.