విజయనగరం

అంగన్‌వాడీ కార్యకర్తలు స్మార్టు ఫోన్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జనవరి 23: ఆధునికత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో అంగన్‌వాడీలకు పనిభారం తగ్గించి పటిష్టంగా కేంద్రాలను నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ఫున్లను సిబ్బందికి సరఫరా చేసింది. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిపి పిరిడి ఎల్లమ్మ, ఎంపిటిసి బండారు బాలాజీ చేతులు మీదుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారులు గాయత్రిదేవి, మేరీవనిత వాటి వినియోగం, ఆవశ్యకత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జడ్పీటిసి బాలాజీ మాట్లాడుతూ కేంద్రాల నిర్వహణతోపాటు శారీరక శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మంచి ఆశయంతో ప్రభుత్వం అంగన్‌వాడీ సేవలు మెరుగుపరచాలనే ఈ స్మార్ట్ఫున్లు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. స్మార్ట్ఫున్లు వినియోగంపై అందిస్తున్న శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరైన దేవుపల్లి సెక్టారుకు సంబంధించిన అంగన్‌వాడీ కార్యకర్తలు 23మందిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటిసి బాలాజీ ఆదేశించారు. హాజరైన వారి శాతం తక్కువగా ఉండడంతో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గాయత్రిదేవిని వివరణ కోరారు. దీంతో మండలంలో బొండపల్లి, గొట్లాం, దేవుపల్లి సెక్టార్లలో గల 70కేంద్రాలు ఉన్నాయని వీరిలో దేవుపల్లి సెక్టార్‌కు చెందిన 24మందికి 23మంది గైర్హాజరయ్యారని, వీరిపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడి ఒ ఎం.ప్రకాశరావు, ఉపతహశీల్దార్ శ్రీనివాసరావు, టిడిపి నాయకులు జి.జె.వర్మ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయాన్ని పరిశీలించిన కలకత్తా ప్రతినిధులు
బొండపల్లి, జనవరి 23: మండల కేంద్రమైన బొండపల్లి శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం కలకత్తాకు చెందిన రాజారామ్మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ప్రతినిధులు పరిశీలించారు. ఈ మేరకు గ్రంథాలయం నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ డిప్యూటీ లైబ్రరియన్ బి.పోతరాజు, నిర్వాహకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.