విజయనగరం

ఆర్టీసీ విజయనగరం ఆర్‌ఎంగా అప్పలరాజు నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 16: ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజనల్ మేనేజర్‌గా ఎ.అప్పలరాజు నియమితులయ్యారు. విశాఖపట్టణం రీజియన్ (అర్బన్) డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అప్పలరాజుకు పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి రీజనల్‌మేనేజర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ రీజనల్‌మేనేజర్‌గా పనిచేస్తున్న పి.అప్పన్నను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి చీఫ్ ఇంజనీర్ (ఐటి)గా బదిలీ చేశారు. సుమారు నాలుగేళ్లపాటు రీజనల్‌మేనేజర్‌గా పనిచేసిన అప్పన్న ఆర్టీసీ నష్టాలను తగ్గించడంలో విశేషంగా కృషి చేశారు. ఇక్కడికి రీజనల్‌మేనేజర్‌గా బదిలీపై వస్తున్న అప్పలరాజు గతంలో శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేశారు. అందువల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో విస్తరించిన విజయనగరం రీజియన్‌పై ఆయనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ఈ రీజియన్ పరిధిలో విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. వీటిని లాభాలబాటలో నడిపించే బాధ్యత కొత్తగా నియమితులైన రీజన్‌మేనేజర్ అప్పలరాజుపై ఉంది.

దళితుల అభివృద్ధే ధ్యేయం
గరివిడి, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో దళితులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ థ్యేయమని ఈ దిశగా చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని చీపురుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మండలంలోని గొట్నంది గ్రామంలో శుక్రవారం జరిగిన దళితతేజం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలను సందర్శించి వౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ప్రధానంగా ఆయా కాలనీలకు రహదారులు, తాగునీరు, విద్యా, విద్యుత్ వంటి సదుపాయాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, ఎంపిపి పైల సింహాచలం, మాజీ ఎంపిపి బలరామ్, ఆర్‌ఇసిఎస్ వైస్‌చైర్మన్ సురేష్, స్థానిక సర్పంచ్ సిగటాపు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.