విజయనగరం

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 16: ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని తాడ్డి యువసేన గజపతినగరం నియోజకవర్గ అధ్యక్షుడు తాడ్డి జశ్వంత్‌నాయుడు అన్నారు. శుక్రవారం ప్రత్యేక హోదాకోసం తాడ్డియువసేన ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై విద్యార్థులు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్లు జంక్షన్‌లో జాతీయ రహదారిపై ప్రజలను ఉద్దేశించి జశ్వంత్‌నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి సమంజసం కాదని అన్నారు. దీని ప్రభావం ఆంధ్ర రాష్ట్ర యువతపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే యువతకు నిరుద్యోగ సమస్య ఎదురై రాష్ట్రం అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గజపతినగరంలో ప్రారంభమైన ప్రత్యేక హోదా ఉద్యమంలానే భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చేంతవరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని, అవసరమైతే తాను ఆమరణ నిరాహారదీక్షకు కూడా వెనుకాడనని హెచ్చరించారు. గజపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి వెయ్యిమంది విద్యార్థులు ఫ్లెక్సీలతో రాష్ట్రానికి న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చంపావతి నది వంతెన వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు లెంక స్వామినాయుడు, లెంక రోహిత్, శ్రీకాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధనలో
ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం
దత్తిరాజేరు, ఫిబ్రవరి 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని గజపతినగరం నియోజకవర్గ వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దత్తిరాజేరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినపుడు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, దీంతో రాష్ట్రం వెనుకబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఆసరాగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదాకోసం గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర వైసిపి నాయకులు జగన్ ఆధ్వర్యంలో ధర్నాలు, బహిరంగ సభలతోపాటు పలు నినాదాలతో పోరాటాలు చేస్తున్నామని అన్నారు.
ప్రత్యేక హోదా సాధన కోరుతూ ముఖ్యమంత్రిచంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి తెలియచెప్పడానికి మార్చి 1వ తేదీన విజయనగరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో మార్చి 4వ తేదీన రాష్ట్ర వైసిపి నాయకుల ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టేందుకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుండి నాయకులు, మహిళానాయకులు తరలివేళ్తామని చెప్పారు. వైసిపికి చెందిన బూత్‌లెవెల్ కన్వీనర్లకు ఈనెల 22,23,24 తేదీలలో విజయనగరంలో గల పూల్‌బాగ్‌లో జరిగే జగన్నాథస్వామి ఆలయ ఆవరణలో శిక్షణా కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్టవ్రైసిపి నాయకులు కరుణాకరరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నాయకులు పాల్గొంటారని, వైసిపికి చెందిన మహిళా కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామ వైసిపి నాయకులు పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య కోరారు. సమావేశంలో మండల వైసిపి కన్వీనర్ కడుబండి రమేష్, మాజీ జడ్పీటిసి మంత్రి అప్పలనాయుడు, కో- ఆపరేటీవ్ అధ్యక్షుడు సింహాద్రి అప్పలనాయుడు, సర్పంచ్ మహదేవ్ ఫణీంద్ర, సుమల శ్రీనివాసరావు, గోవింద, మజ్జి అప్పలనాయుడు, ఆర్టికల్ నాయుడులతోపాటు చుక్కమురళి, తిరుపతి, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.