విజయనగరం

అశోక్‌ను విమర్శించే అర్హత వైకాపా నేతలకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 16: కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజును విమర్శించే అర్హత వైకాపా నేతలకు లేదని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు అన్నారు. శుక్రవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందితే వైకాపా నేతలు అవినీతిలో పూర్తిగా మునిగిపోయారన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వేల కోట్ల అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లలో అవినీతి జరిగిందంటున్నారు. దానిపై మీకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
ఆనాటి కాంగ్రెస్ స్పీకర్ శ్రీపాదరావు చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అశోక్‌గజపతిరాజు పొందిన విషయం వైకాపా నేతలకు తెలియదా అని డాక్టర్ విఎస్ ప్రసాద్ గుర్తు చేశారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని ఎయిర్‌పోర్టు టెండర్లలో ముడుపులు తీసుకున్నారంటే ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. ఆనాడు తారకరామ పూర్తిగాకుండానే ముడుపులు తీసుకొని గాలిగొట్టాలు వేసినది వారు కాదా అని ఆయన ప్రశ్నించారు. అశోక్‌ను విమర్శించే స్థాయి మీకు లేదని ఆయన స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక బృహత్తర ప్రణాళిక అని అందులో కార్గొ,ఎయిరో స్పస్ పరిశ్రమలతో విమానాశ్రయం నిర్మించాలన్నదీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. బోగాపురంలో ఎంఆర్‌ఒకు అవకాశం కల్పిస్తే ఏటా సుమారు రూ.5వేల కోట్లు మనకు ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సైలాడ త్రినాధ్ మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌కు ఈ దుస్ధితి తెచ్చింది మీరు కాదాఅని ఆయన విమర్శించారు. వైకాపా అధినేత జగన్‌పై ఇప్పటికే 11 కేసులు ఉండగా తాజాగా మరో కేసు నమోదైన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తెరగాలన్నారు. వైకాపా నేతలు వైన్స్ సిండికేట్ ద్వారా కోట్లు దండుకోవడం ప్రజలకు తెలుసని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కె.నరసింగరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొద్దుల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.