విజయనగరం

మార్చిలోగా కనె్వర్జెనీ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో ఉపాధి నిధులతో చేపట్టే కన్వర్జెన్సీ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి 24 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పటికే 16.4 లక్షల పనిదినాలు కల్పించామని చెప్పారు. వచ్చే 45 రోజులు రోజుకు 13 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించామన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరు సహకరించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కేంద్రం మంజూరు చేసే నిధులు మురిగిపోకుండా చూసే బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి పనులకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలన్నారు. వారపు సంతల కోసం షెడ్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని పిఆర్ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి చెప్పారు. ప్రతి మండలంలో ఒక వారపు సంతలో షెడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో భూగర్భ డ్రైనేనీ నిర్మాణాలకు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లిలో ఉపాది పనులు ముమ్మరం చేశామన్నారు. జిల్లాలో ఏడాది సగటున 1.99 లక్షల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో నగదు కొరత ఎక్కువగా ఉందని కొంతమేరకైన నగదు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డ్వామా పిడి రాజగోపాల్, సిఇఒ వేంకటేశ్వరరావు, డిపిఒ సత్యనారాయణ, పిడి రాబర్ట్స్, జెడి సింహాచలం, సెట్విజ్ సిఇఒ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
================

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము టీడీపీకి లేదా?
* జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల
బొబ్బిలి, ఫిబ్రవరి 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు నిలదీశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం చట్టబద్ధంగా ఇస్తామన్న ప్రత్యేక నిధులతోపాటు ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక హోదాపై కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అయినప్పటికీ రాష్ట్రం చిత్తశుద్ధితో కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ నాయకులు జగన్ చేస్తున్న పోరాటాన్ని హాస్యాస్పదంగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరుపున వివిధ రూపాలలో ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు రెవెన్యూ డివిజన్‌లో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేస్తామన్నారు. మార్చి 2న హైవే దిగ్భందన, 6,7 తేదీలలో జంతర్, మంతర్ వద్ద ధర్నా, 8వ తేదీన ఛలో పార్లమెంట్ నిర్వహించి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. టీడీపీ ఎంపీలు తూతూమంత్రంగానే ఆందోళనలు చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రప్పించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడుతోపాటు నాయకులు బంటు కృష్ణమూర్తినాయుడు, పాలవలస సూర్యనారాయణతోపాటు కందుల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.