విజయనగరం

డిసెంబర్ నాటికి తారకరామ ప్రాజెక్టు పూర్తికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 16: జిల్లాలోని గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై నిర్మించిన తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు ఎస్‌ఇ పోలేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టనె్నల్ నిర్మాణం పెద్ద అడ్డంకిగా ఉందన్నారు. అందువల్ల ప్రాజెక్టు పనులు జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయన్నారు. బ్యారేజీ నుంచి జలాశయం వరకు 1.472 కిమీ నిడివి గల టనె్నల్ పనులను చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు బ్యారేజి నుంచి మళ్లింపు కాలువ ద్వారా నీటిని కుమిలి గ్రామం వద్ద రిజర్వాయరులో నిల్వ చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా 24710 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. అందులో ప్రస్తుతం కుమిలి చెరువు ద్వార సాగులో ఉన్న 8172 ఎకరాలు స్ధిరీకరించడంతోపాటు కొత్తగా 16538 ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్నదీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పూసపాటిరేగ, డెంకాడ, బోగాపురం మండలాల్లోని 49 గ్రామాలకు లబ్ధి కలుగుతుందని వివరించారు. దాంతోపాటు డెంకాడ ఆయకట్టుక కింద ఉన్న 5203 ఎకరాలకు సాగు నీరు అందించనున్నామని వివరించారు. మరోపక్క విజయనగరం పట్టణ వాసులకు తాగునీటి కోసం 0.48 టిఎంసిల నీటిని కేటాయించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.471.31 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.211.22 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. సివిల్ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. హైడ్రోమెకానికల్ పనులు, మట్టికట్టలు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా మళ్లింపు కాలువకు సంబంధించి 41 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం 13.4 కిమీగాను 9 కిమీ పొడవు కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయన్నారు. భూసేకరణకు సంబంధించి మరో 400 ఎకరాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు.