విజయనగరం

బాధితులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఫిబ్రవరి 20: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ రెండోరోజు మంగళవారం కూడా నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. జిల్లాకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి మిగిలి పోయిన బాధితుల బాండ్లను పరిశీలించి లబ్ధిదారుని జాబితాలో చేర్చాలని కోరారు. రెండో రోజు శిబిరానికి పార్వతీపురం సిపి ఐ నాయకుడు ఆర్ వి ఎస్ కుమార్, సిపియం నాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి, జిల్లా ఎపిటి ఎఫ్ నాయకుడు బంకురు జోగినాయుడు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

నాలుగోసారి వాయిదా పడ్డ ఆశీల వేలం
పార్వతపురం (రూరల్), ఫిబ్రవరి 20: స్థానిక పురపాలక కార్యాలయంలో మార్కెట్, ప్రధాన రహదారిలో రోడ్లపై వ్యాపారం చేస్తున్న వర్తకుల వద్ద ఆశాల వసూళ్లకు సంబంధించి బహిరంగ వేలం పాట మంగళవారం కూడా వాయిదా పడింది. ఉదయం నుంచి మున్సిపల్, రెవెన్యూ అధికారి శంకర్రావు, ఇతర సిబ్బంది వేలంపాటలో పాల్గొన్నారు. పాటదారుల కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాటదారులు ఎవరూ హాజరుకాకపోవడంతో వేలంపాట మరల వాయిదా వేశారు. నాలుగోసారి కూడా ఆశీలంవేలం పాటకు పాటదారులు హాజరు కాకపోవడంతో అటు మున్సిపల్ కమీషనర్ ఎన్. శ్రీనివాసరావుతో పాటు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసారు. వరుసగా నాలుగోసారి వాయిదా పడడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ద్వారపురెడ్డి శ్రీనుపై వైకాపా సస్పెన్షన్ ఎత్తివేత
పార్వతీపురం (రూరల్), ఫిబ్రవరి 20 : పట్టణంలోని 20, 13 వార్డుల కౌన్సిల్ సభ్యులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు,జ్యోతి లపై సస్పెన్షన్ ఎత్తి వేసినట్లు ఆ పార్టీ అరకు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైసిపి గుర్తుతో పోటీ చేసి గెలుపొందిన ద్వారపురెడ్డి దంపతులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వీరిని 2014 నవంబర్ 16 న పార్టీ నుంచి అధిష్టానం సస్పెస్షన్ చేసిందన్నారు. మళ్లీ వీరు వైసిపిలో చేరుతామని అభ్యర్థిస్తూ ఇకపై పార్టీ నియమ నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో పార్టీ నాయకత్వం తో విధేయతతో పనిచేస్తామని కోరడంతో అధిష్టానం వీరిపై ఉన్న సస్పెన్షన్ ను తొలగించినట్లు తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితుల దీక్షకు వైకాపా మద్ధతు..
పార్వతీపురం (రూరల్), ఫిబ్రవరి 20: పట్టణంలో అగ్రిగోల్డ్ బాధితులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు వైకాపా తన సంఘీభావం తెలిపింది. ఇందులో భాగంగా స్థానిక ఆర్డీఒ ఆఫీసు వద్ద నిర్వహిస్తున్న దీక్షలో వైసీపీ నియోజక వర్గ ఇన్ చార్జి జమ్మాన ప్రజన్నకుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. సమస్య సాధించే వరకు బాధితుల వెంట ఉంటామని వారు హామీ ఇచ్చారు. వైకాపా నాయకుల సంఘీభావానికి అగ్రీగోల్డ్ బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అగ్రీగోల్డ్ ఆస్తులను కాజేశారని ఆరోపించారు.