విజయనగరం

దళిత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: దళిత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. దళితతేజం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 31వ వార్డు పరిధిలో అంబేద్కర్‌కాలనీలో, 26వ వార్డు పరిధిలో గోకపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ దళితుల సంక్షేమం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుందన్నారు. అందువల్ల ఆయా పథకాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, మున్సిపల్ కౌన్సిలర్లు కొర్నాన రాజ్యలక్ష్మి, సైలాడ త్రినాధరావు, మైలపిల్లి పైడిరాజుతోపాటు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు..

విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలి
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: జిల్లాలో విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారోజు శ్రీనివాసరావు కోరారు. పట్టణంలో బొండాడవీధి కామాక్షి ఆలయంలో మంగళవారం విశ్వ బ్రాహ్మణ రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన ముఖ్యనేతలతో పాటు పలు మండలాలకు చెందిన నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విశ్వబ్రాహ్మణుల గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోను విశ్వబ్రాహ్మణులు వెనుకబడి ఉన్నారని తెలిపారు. విజయనగరం పట్టణంలో 20వేల మందికి పైగా విశ్వబ్రాహ్మణులు ఉంటే, ఏ రాజకీయపార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదని తెలిపారు. అందువల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు తగినన్ని సీట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు అప్పరబత్తుల నరసింహాచారి, ధర్మవరపుసత్యారావు, జానా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీసేవలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే క్లియర్ చేయండి
పార్వతీపురం, ఫిబ్రవరి 20: మీసేవలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే క్లియర్ చేయాలని భూ పరిపాలనశాఖ ఛీప్ కమిషనర్ అనీల్ చంద్రపునీఠా ఆదేశించారు. సిసిఎల్‌ఎ నిర్వహించిన వీడియో కానె్ఫరెన్సుకు పార్వతీపురం మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. అలాగే అగ్రికల్చర్‌ను నాన్ అగ్రికల్చర్‌గా మార్పుకోసం వచ్చే దరఖాస్తులు క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒడియఫ్ ప్రగతితో పాటు గృహ నిర్మాణ కార్యక్రమాల్లో రెవెన్యూశాఖ కీలక భూమి పోషిస్తున్నప్పటీకీ రెవెన్యూ పరమైన అంశాలపై నిర్లక్ష్యం తగదని ఆయన సూచించారు. ఈ కార్యక్రకమంలో పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పత్రి గణపతిరావు, డిప్యూటీ తహశీల్దారు చంద్రవౌళీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.