విజయనగరం

ఆవేశం కలిగింది..ఆవేదన మిగిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐటిఐని విద్యార్హతగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు చేపట్టిన ఆందోళనలో అమాయకులైన యువకులు పోలీసుకేసుల్లో ఇరుక్కున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళలో పాల్గొన్న యువకులు ఆవేశంగా తీసుకున్న నిర్ణయం చివరికి ఆవేదనగా మిగిలింది. విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగ యువకుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో అరెస్టులకు దారి తీసింది. దీంతో పోలీసుకేసుల్లో ఇరుక్కున్న యువకుల కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోటీపరీక్షులకు హాజరయ్యేందుకు కోచింగ్ సెంటర్లల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువకులు పట్టణంలో పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. వీరిని సమీకరించిన విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొనాలని కోరారు. ఆ మేరకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆందోళనలో భాగంగా కోట జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని మొదటి నిర్ణయించారు. అయితే ర్యాలీలో పాల్గొన్న యువకులు రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేయాలని పట్టుపట్టినట్లు తెలిసింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు చేతులేత్తేశారు. కోట జంక్షన్ నుంచి గురజాడ అప్పారావురోడ్డు, ఎంఆర్ కళాశాల, రామానాయుడు రోడ్డు మీదుగా సాగిన ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది యువకులు విద్యార్థి సంఘాల నాయకుల మాట వినకుండా రైల్వేస్టేషన్ వైపుదారి మళ్లించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారిని నిలవరించే ప్రయత్నం చేసింది. అధిక సంఖ్యలో విద్యార్ధులు, నిరుద్యోగ యువకులు ఉండటంతో పెద్దఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ రోడ్డులో పరిస్థితి శృతిమించే అవకాశం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులను, నిరుద్యోగులు చెదరగొట్టారు. అయితే 16 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందరు కోసం తాము ఆందోళన చేస్తే పోలీసుకేసుల్లో ఇరుక్కున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా పట్టించుకోవడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.